‘దువ్వాడ జగన్నాథమ్‌’గా బన్నీ

427

సరైనోడు సినిమాతో భారీ హిట్ అందుకున్న అల్లు అర్జున్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సరైనోడు తర్వాత దువ్వాడ జగన్నాథమ్‌గా ముందుకువస్తున్నాడు. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర లోగోను చిత్ర బృందం ఆదివారం సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి రాకింగ్‌ స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

bunny

టైటిట్‌ అదిరింది.. డీజే రాకింగ్‌.. అంటూ దేవీశ్రీ ప్రసాద్‌ బన్నీకి శుభాకాంక్షలు తెలియజేశాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైనట్లు అల్లుఅర్జున్‌ తెలిపాడు. దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత బన్నీతో చిత్రం చేయబోతున్నాను.. దర్శకుడు హరీశ్‌ అర్జున్‌ ఇమేజ్‌ తగిన స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలిపారు. దిల్‌ రాజు, బన్నీ కాంబినేషనల్‌లో వచ్చిన ‘ఆర్య’, ‘పరుగు’ చిత్రాలు మంచి హిట్‌ సాధించాయి.వరుసగా 50 కోట్ల సినిమాలతో సత్తా చాటుతున్న బన్నీ తన నెక్ట్స్ సినిమాతో భారీ వసూళ్లు సాధించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.హీరోయిజానికి మంచి కామెడీ ఎలిమెంట్స్ను జోడిచడంలో స్పెషలిస్ట్ అయిన హరీష్ శంకర్, బన్నీ కోసం ఎనర్జిటిక్ స్క్రిప్ట్ను రెడీ చేశాడట.