దావూద్ చిరునామాలు-6 రైట్‌

382
3 Of 9 Addresses Of Dawood Ibrahim In Pakistan Found Incorrect: UN
3 Of 9 Addresses Of Dawood Ibrahim In Pakistan Found Incorrect: UN

పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఆ గడ్డపైనే ఉన్నాడనడానికి ఆధారాలు లభించాయి. ఇప్పటివరకు పాకిస్తాన్ దావూద్ ను ఎంతలా కాపాడుకుంటూ వచ్చిందో తెలిసిన విషయమే. తాజాగా ఐక్య‌రాజ్య‌స‌మితి దావూద్ ఇబ్ర‌హీం ఆచూకీకి సంబంధించి భార‌త్ అందించిన చిరునామాల‌ను నిర్ధారించింది.

దావూద్ పాకిస్థాన్‌లో తల‌దాచుకున్నాడంటూ మొత్తం తొమ్మిది అడ్రెస్‌ల‌ను ఐక్యరాజ్య‌స‌మితికి భార‌త్ అప్పగించింది. అందులో మూడు చిరునామాల‌ను కొట్టిపారేసిన ఐక్య‌రాజ్య‌స‌మితి మిగతా ఆరు అడ్రెస్‌లను మాత్రం నిర్ధారించింది. కానీ పాకిస్థాన్ మాత్రం దావూద్ ఆచూకీ తెలియ‌ద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి విన్నవించింది. దావూద్‌కు ఆశ్ర‌యం క‌ల్పించిన పాకిస్థాన్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఐక్య‌రాజ్య‌స‌మితికి స‌మ‌ర్పించిన లేఖ‌లో భార‌త్ డిమాండ్ చేసింది. పాకిస్తాన్‌లో దాచుకున్న‌ దావూద్ నిత్యం త‌న అడ్రెస్‌ల‌ను మారుస్తూ అక్ర‌మంగా ఆస్తుల‌ను సంపాదించాడు. 1993లో ముంబైలో జ‌రిగిన పేలుళ్ల కేసులో దావూద్ ప్ర‌ధాన నిందితుడు.

కాగా, దావూద్ ఇబ్రహీం చిరునామాతో పాటు అతని పూర్తి వివరాలను భారత నిఘా వర్గాలు (ఇంటిలిజెన్స్) గతేడాదే సేకరించాయి. అతని భార్య పేరుతో ఉన్న టెలిఫోన్ బిల్లుతో సహ నిఘా వర్గాలు ఆధారాలను సేకరించాయి. దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోని కరాచిలో ఉన్నాడని పక్కా ఆధారాలు సేకరించాయి. దావూద్ కు భార్య, ఒక కొడుకు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వెలుగు చూసింది. భార్య మెహజబీన్ షేక్, కొడుకు మెుయిూన్ నవాజ్, కుమార్తెలు మహరుక్, మెహ్రీన్, మాజియాతో కాలిసి దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లో ఉన్నాడని నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి.