తెలంగాణకు జాన్సన్‌ అండ్ జాన్సన్‌ ప్రశంసలు

396

తెలంగాణ రాష్ర్టంలో ఉన్న పెట్టుబడి అనుకూల వాతావరణం, ఇక్కడి ప్రభుత్వ సహకారాన్ని జాన్సన్ & జాన్సన్ గ్రూప్ అభినందించింది. ఇవాళ హైదరాబాద్ లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు, జాన్సన్ & జాన్సన్ సీనియర్ ఉపాద్యక్షురాలు క్యాతీ వెంగల్ తో సమావేశం అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలోని జాన్సన్ & జాన్సన్ ప్రాంగణంలో మంత్రి, క్యాతీ వెంగల్ లు మెక్కలు నాటారు. అక్కడి జాన్సన్ & జాన్సన్ ప్రాంగణాన్ని సందర్శించారు. అ తర్వతా హైదారాబాద్ లో మంత్రితో జాన్సన్ & జాన్సన్ ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి కెటియార్ ఒక పవర్ పాయింట్ ప్రజేంటషన్ ద్వారా ఇక్కడి ఉన్న పెట్టుబడి అవకాశాలు, తెలంగాణలోనే ఏందుకు పెట్టుబడులు పెట్టాలి, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ విధానాలు వంటి అంశాలను వివరించారు.

KTR

మంత్రి ప్రజేంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ, దీర్ఘకాలంలో ప్రభుత్వ విజన్ వంటి అంశాలను క్యాతీ వెంగల్ కు తెలియజేశారు. హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, లైప్ సైన్సెస్, ఫార్మ రంగాల్లో జాన్సన్ & జాన్సన్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి తన పిపిటిలో వివరించారు. తెలంగాణలో ఇప్పటికే భారత దేశం ఫార్మ, హెల్త్ కేర్ క్యాపిటల్ గా ఉన్నదని, నగరంలో మెడికల్ టూరిజం హబ్ గా మారిందని, ఈ నేపథ్యంలో ముఖ్యంగా జాన్సన్ & జాన్సన్ హెల్త్ కేర్ రంగంలో విస్తరించేందుకు ప్రయత్నించాలని కోరారు. మెత్తంగా భారత దేశం హెల్త్ కేర్ రంగం 120 బిలయన్ డాలర్లని, కేంద్రం ఇప్పటికే మేక్ ఇన్ ఇండియా ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న విషయాన్ని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సైతం రాష్ర్టంతో తయారీ రంగంలో వచ్చే పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తున్నదని, ఇందుకోసం ప్రత్యేకమైన ప్రొత్సకాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ఇక్కడి ప్రభుత్వం ప్రగతి శీల ప్రభుత్వమని మంత్రి తెలిపారు. ఇక్కడ తాము ఏర్పాటు చేసిన టియస్ ఐపాస్ విధానం అత్యంత పారదర్శకమైనదని, అనుమతుల్లో అవినితీకి అవకాశం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నదని, నీటికి, భూమికి ఎలాంటి కొరత లేదన్నారు.

Rama rao

తెలంగాణ ప్రభుత్వం నుంచి మంత్రి మూడు ప్రతిపాదనలను మంత్రి జాన్సన్ & జాన్సన్ కంపెనీ ముందుంచారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫార్మసీటిలో పెట్టుబడులు పెట్టాలన్నారు. దీంతోపాటు జాన్సన్ & జాన్సన్ యెక్క జె ల్యాబ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక మెడ్ టెక్ పార్క్ లో పార్కులో ప్రధాన పెట్టుబడిదారుగా ఉండాలని మంత్రి కోరారు. తెలంగాణ ప్రభుత్వం, జాన్సన్ & జాన్సన్ భాగసామ్యం మరింత బలోపేతం కావడం కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి తెలిపారు.

KTR
జాన్సన్ & జాన్సన్ కొత్తూర్ ప్రాంగణ నిర్మాణంతోపాటు పాటు తమ సంస్ధకు ప్రభుత్వం వైపునుంచి అందిన సహకారాన్ని క్యాతీ వెంగల్ అభినందించారు. గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ర్టానికి వచ్చిన పలు అంతర్జాతీయ సంస్ధల పెట్టుబడులను తాము సైతం గుర్తించామన్నారు. తెలంగాణ లోని మెడికల్ డివైజెస్ పార్కు పట్ల అమె అసక్తి వ్యక్తం చేసారు. ఫార్మసీటీలోనూ ప్రభుత్వం తెలిపిన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తే పలు అంతర్జాతీయ కంపెనీలు భాగసామ్యానికి ముందుకు వస్తాయన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, టియస్ ఐఐసి యండి వెంకట నర్సింహ రెడ్డిలు ఉన్నారు.