తెర‌పైకి విజ‌య్ మాల్యా బ‌యోపిక్..

233
vijay mallya

భార‌తీయ చ‌ల‌న చిత్రప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం బ‌యోపిక్ ల హ‌వా న‌డుస్తుంది. చాలా మంది ప్ర‌ముఖుల బ‌యోపిక్ లు తీస్తామ‌ని ప్ర‌క‌టించారు ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు. జీవిత చ‌రిత్ర‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ బ‌యోపిక్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇటివ‌ల తెలుగు, త‌మిళంలో విడుద‌లైన అల‌నాటి అందా న‌టి సావిత్రి జివిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి సినిమాకు ఎంత పెద్ద విజ‌యం సాధించిందొ మ‌న‌కు తెలిసిందే. భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌రికొంత బ‌యోపిక్ లు తెర‌పైకి వ‌చ్చిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

nihalani, govinda

తాజాగా మ‌రో వ్య‌క్తి బ‌యోపిక్ కూడా తెర‌పైకి వ‌చ్చింది. లిక్క‌ర్ డాన్ , కింగ్ ఫిష‌ర్ మాజీ యజ‌మాని విజ‌య్ మాల్యా జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బాలీవుడ్ సెన్సార్ బోర్డు మాజీ చైర్మ‌న్ పహ్లాజ్ నిహ్లాని. ఈసినిమాలో విజయ్ మాల్యా పాత్ర‌ను ప్ర‌ముఖ బాలీవుడ్ నటుడు గోవింద పోషించ‌నున్నట్లు నిహ్లాని తెలిపారు.

govinda

విజ‌య్ మాల్యా పాత్ర‌లో గోవింద గెట‌ప్ చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతార‌న్నారు. కింగ్ ఫిష‌ర్ క్యాలెండ‌ర్ పై ఓ పాట‌ను కూడా షూట్ చేసిన‌ట్టు తెలిపారు. సినిమా షూటింగ్ కూడా ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. గ‌తంలో కంటే గోవింద ఇప్పుడు ఫిట్ గా ఉన్నార‌ని తెలిపారు. బ్యాంక్ స్కాం స‌న్నివేశాల‌ను ఈసినిమాలో వినోదాత్మ‌కంగా తెర‌కెక్కించామ‌న్నారు. విజ‌య్ మాల్యా జీవితంలో జ‌రిగిన విష‌యాల‌న్ని ఈసినిమాలో చూసిస్తామన్నారు పహ్లాజ్ నిహ్లానీ.