తమన్నాపై తప్పుడు ప్రచారం

217
tamanna-make-her-mollywood-debut-dileep
tamanna-make-her-mollywood-debut-dileep

సౌతిండియన్ సినిమాలో టాప్ హీరోయిన్లలో ఒకరుగా దూసుకుపోతోన్న తమన్నా, ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు టాప్ సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘బాహుబలి 2’, ‘అభినేత్రి’, ‘కత్తిసందై’ తదితర సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక వీటితో పాటు ఈమధ్యే ఆమె తన మళయాల డెబ్యూట్ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కే ‘కమ్మర సంభవం’ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారన్న వార్త మూడు రోజులుగా బాగా వార్తల్లో వినిపిస్తోంది.

దీనిపై క్లారిటీ ఇచ్చింది తమన్నా.”ఇది తప్పుడు వార్త. తాను ఆ సినిమాలో నటించడం లేదు. తాను ఏ సినిమా సైన్ చేశానో ఆ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేస్తా. ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు” అని క్లారిటీగా చెప్పింది మిల్కీ బ్యూటీ.ప్రస్తుతం అభినేత్రి షూటింగ్ లో పాల్గొంటుంది తమన్నా. ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి ఎఎల్ విజయ్ దర్శకుడు.