టీమిండియాను ఒడించడానికి అస్ట్రేలియా ఇప్పటి నుండి ప్రణాళికలు రచిస్తోంది. అస్ట్రేలియా క్రికెట్ బ్యాటింగ్ కోచ్‌గా నియమితుడైన గ్రేమ్ హిక్ చేసిన వ్యాఖ్యల ద్వారా వెల్లడయింది. 2017లో ఇండియా టూర్‌కు అస్ట్రేలియా సన్నద్దం అవుతోంది.
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు స్పెషలిస్టు బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికైన గ్రేమ్ హిక్ మాట్లాడుతూ.. ఇటీవల విదేశాల్లో అస్ట్రేలియా జట్టు తడబడుతోందన్నారు. ఇతర దేశాల్లో పరిస్థితులకు భారత్ లాంటి ఉపఖండ దేశాల్లో పరిస్థితులు చాలా భిన్నమన్నారు. భారత్ పర్యటనకు వెళ్లినప్పుడు ముందుగా అక్కడి పరిస్థితులకు అలవాటుపడాలని, ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం కేటాయించాలని.. దీని ద్వారా టెస్టు క్రికెట్‌లో ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థులపై ఆధిక్యం కొనసాగించవచ్చని.. ఓపిగ్గా ఉంటేనే సొంతగడ్డపై భారత్‌ను జయించగలమని హిక్ తెలిపారు.
భారత్‌ను సొంతగడ్డపై ఎదుర్కోవడం సవాలుతో కూడుకున్నదని తెలిపారు. తమ జట్టు ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమై భారత్ పర్యటన గురించి చర్చిస్తామన్నారు. తప్పకుండా పలువురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తారని ధీమా వ్యక్తం చేశారు హిక్. ఇటీవల శ్రీలంకతో మూడు టెస్టులాడిన ఆస్ట్రేలియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే అస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్లో అడడం వారికి కలిసొచ్చే అంశం.