టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్..

56
Punjab Kings

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిస్తే… రాజస్థాన్ రాయల్స్ 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు, 4 ఓటములతో ఆరోస్థానంలో ఉంది. పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్ ల్లో 3 విజయాలు, 5 ఓటములతో ఏడోస్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు నేటి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లలో తలపడగా.. పంజాబ్ జట్టు 12 సార్లు, రాజస్థాన్ జట్టు 10 సార్లు విజయం సాధించింది.