టాలీవుడ్ మన్మధుడి పుట్టిన రోజు

160
Nag @ 56 in Thailand
Nag @ 56 in Thailand

అందమైన చిరునవ్వు..ఆకట్టుకొనే రూపం..రొమాంటిక్ లుక్..మ్యాన్లీ నేచర్..కలగలిస్తే ‘నాగార్జున’..ఎంత వయసొచ్చినా ఇంకా నవ యువకుడిలా కనిపించడం ఆయన స్టైల్ . అందుకే ఆయన్ను టాలీవుడ్ ‘మన్మథుడు’ అంటూంటారు. ఈ రోజు టాలీవుడ్ మన్మధుడు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టిన రోజు. 1959 ఆగష్టు 29 న చెన్నైలో జన్మించాడు. మిచిగాన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎమ్.ఎస్ చేసి 1986లో ‘విక్రమ్’ సినిమాతో ఇండస్ట్రీలో అరంగ్రేటం చేసాడు. అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సృష్టించుకున్నాడు.

ఇమేజ్ చట్రంలో బందీ అయిపోయిన టాలీవుడ్ హీరోయిజాన్ని సైకిల్ చెయిన్ తో బైటికి లాగిన న్యూ వేవ్ హీరో ‘నాగార్జున’. కొత్తదనానికి పెద్ద పీట వేయడమే తన సిద్ధాంతమని చాటిచెప్పిన ట్రెండ్ సెట్టర్ ఆయన. ప్రయోగాలకు ఏ మాత్రం భయపడని హీ మ్యాన్ ‘నాగార్జున’. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ‘నాగార్జున’ కి అసలు సినిమాల్లోకి రావల్సిన అవసరం లేదు. తన కుంటూ ఒక మార్కు ఉండాలనుకున్నారు. అలా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. గీతాంజలి సినిమాతో మొదలైన ఆయన ప్రయోగాల పర్వం నేటికి కొనసాగుతుంది. శివ సినిమాతో తెలుగు సినిమా స్థితి గతులనే మార్చారు ఆయన. అయన ఇప్పటికీ కొత్త దర్శకులని, కొత్త కాన్సెప్ట్ లని బాగా ఎంకరేజ్ చేస్తారు. యాక్షన్, లవ్ స్టొరీ సినిమాలే కాదు భక్తిరసమైన సినిమాలు చేసి కూడా మెప్పించగలనని నిరూపించారు ఆయన. కె. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో వచ్చిన అన్నమయ్య ఆయన కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా. శ్రీ రామదాసు పాత్రలో కూడా అటు విమర్శకుల ప్రశంసల్ని ఇటు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు.

చదువు సంధ్య కలిగినోణ్ణి ‘అక్కినేని’ అంతటోడ్ని అని ఆయన ‘విక్రమ్’ టైమ్ లోనే కాలర్ ఎగరేసి ఉంటే ఇంత సుదీర్ఘమైన కెరీర్ ను కొనసాగించేవారే కాదు. హిట్టైతే హీరో, ప్లాపైతే జీరో అనే ఫీలింగ్సేమీ పెట్టుకోకుండా తన బాధ్యత తాను సక్రమంగా నిర్వర్తించారు ‘నాగార్జున’. కొత్తదనానికి పెద్ద పీట వేయడం, కొత్త దర్శకులకు అవకాశమివ్వడం ‘నాగ్’ తన కెరీర్ బిగినింగ్ నుంచి చేస్తూ వచ్చారు. కమర్షియల్ సూత్రాల్ని పాటిస్తూనే కొత్త కథలతో సినిమాలు తీసే చాలా మంది దర్శకుల్ని ప్రోత్సహించారు ‘నాగార్జున’. ఆ ప్రయత్నంలో కొన్ని ప్లాపులొచ్చినా, చాలా వరకూ సక్సెస్ అందుకున్నారు. ‘నాగార్జున’ కెరీర్ ను అనూహ్యమైన మలుపు తిప్పిన సినిమా ‘శివ’. ఈ సినిమాతో టాలీవుడ్ లో మూస మాస్ ట్రెండ్ పూర్తి గా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు తెలుగు సినిమా కథ ఫార్ములానే మారిపోయింది.

ఆ ట్రెండ్ నుంచి ఈ ట్రెండ్ వరకూ తన పర్సనాలిటీతో గ్రీకు వీరుడిగానే కొనసాగుతున్న ‘అక్కినేని నాగార్జున’, తన తనయులతో కూడా పోటీ పడగలనని నిరూపించుకుంటున్నారు. ‘నాగచైతన్య’, ‘అఖిల్’ లకన్నా ‘నాగే’ ఇంకా స్టైలిష్ గా కనిపిస్తుండడం నిజంగా చాలా గ్రేట్. అందుకే ‘నాగార్జున’ ఎప్పుడూ టాలీవుడ్ కు గ్రీకు వీరుడే.  ఇవాళ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు గ్రేట్‌ తెలంగాణ. కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.