జ్యో అచ్యుతానంద ‘క్లీన్ యు’

162

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం `జ్యో అచ్యుతానంద`. రొమాంటిక్ కామెడితో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

nara rohithNara rohithrohith

ఊహలు గుసగుసలాడే చిత్రంతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందిన మరో అందమైన కుటుంబ కథా చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో సినిమాపై మంచి అసక్తి నెలకొంది.

nara rohith

అల్రెడి విడుదలైన పోస్టర్స్, టీజర్, థియేట్రికల్ ట్రైలర్ కు, కల్యాణ్ రమణ సంగీత దర్శకత్వంలో విడుదలైన పాటలకు ఆడియెన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ములుగా నారారోహిత్, నాగశౌర్యల మధ్య మంచి కెమిస్ట్రీ ఉందని, ప్రేక్షకులను ఎంటైర్ చేస్తూనే మంచి ఫీల్ తో, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందంటున్నారు.

rohith