జెఠ్మలానీ జీ.. ఎప్పుడు రిటైర్ అవుతారు?

186
Why do you ask when I’ll die, Jethmalani asks SC
Why do you ask when I’ll die, Jethmalani asks SC

రామ్ జెఠ్మలానీ ప్రముఖ న్యాయవాది,ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నుండి వెలివేయబడిన రాజకీయనాయకుడు. చిక్కుల్లో ఉన్న బడా బడా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆశ్రయించేది ఈయననే. జయలలిత తరుపున, పార్లమెంట్ పై దాడి చేసిన దేశ ద్రోహుల తరుపున ఈయనే వాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే ఈయన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాడు. ఓ కేసులో జెఠ్మలానీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వింత ప్రశ్నను సంధించింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న రామ్ జెఠ్మలానీ వయస్సు 93 ఏళ్ళు. ఇప్పటికీ చక్కని ప్రతిభతో న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారు. ఓ కేసులో సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న జెఠ్మలానీకి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వింత ప్రశ్నను సంధించింది. ‘‘మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు?’’ అని అడిగింది. దీంతో వెంటనే రామ్ జెఠ్మలానీ స్పందిస్తూ ‘‘నేను ఎప్పుడు చనిపోతానని మై లార్డ్ అడుగుతున్నారా? వివరించాలి’’ అన్నారు. దీని అర్థం ఏంటంటే తాను బ్రతికి ఉన్నంతవరకు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే ఉంటానని ఆయన చెప్పకనే చెప్పారు. ఎంఎం కశ్యప్ అనే న్యాయవాదిని ఆయన ఛాంబర్ ఖాళీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో దానికి సంబంధించిన కేసును జెఠ్మలానీ వాదిస్తున్నారు. ఈ సంధర్బంలోనే ఆయనకు ఈ ప్రశ్న ఎదురైంది.