జూలీగణపతి=చారుశీల

456

ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ గతంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన జూలీ గణపతి మూవీ తమిళ్ డబ్బింగ్, రీమేక్ రైట్స్ తీసుకున్న విషయం విదితమే. ఈ చిత్రానికి బాలు మహేంద్ర దర్శకుడు,ఇళయరాజా సంగీతం. జూలీ గణపతి చిత్రంలో జయరామ్,సరిత హీరో,హీరోయిన్స్‌గా నటించారు. అయితే రీసెంట్‌గా రేష్మి నటించిన చారుశీల చిత్రం జూలీ గణపతి చిత్రానికి దగ్గరగా ఉందని…ఈ విషయమై న్యాయం కోసం నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషను దాఖలు చేశారు.

ఇటీవలే ఈ విషయంపై విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసుపై స్పందించిన హైకోర్టు ఈ నెల 24లోగా ఈ రెండు సినిమాలపై రిపోర్ట్ ఇవ్వవలసిందిగా సంబంధిత ఫిలించాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, మరో బోర్డు ‚‚సభ్యుడిని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ మరియు ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్ కలిసి వివాదాస్పద చారుశీల, జూలీగణపతి చిత్రాలను చూసినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల వివాదం తొందరలోనే తేలనుంది.