జయప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తి..

89

నటుడు జయప్రకాశ్ రెడ్డి ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం గుంటూరులోని కొరిటపాడు శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కరోనా కారణంగా అతి తక్కువ మంది సమక్షంలో ఈ అంత్య క్రియలు జరిగాయి. జేపీ తనయుడు కరోనా పాజిటివ్ అవ్వడంతో గుంటూరులోని ఒక ఆసుపత్రిలో భార్యతో పాటు చికిత్స పొందుతున్నాడు. ఆ కారణంగా తండ్రి అంత్యక్రియలకు ఆయన హాజరు కాలేక పోయాడు. ఆయన కుమారుడు చంద్రప్రకాశ్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు.

కొద్ది మంది అభిమానులు బంధుమిత్రులు కలిసి అంతిమ యాత్రను నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎక్కవ మంది హాజరు కావద్దనే ఉద్దేశ్యంతో పోలీసు ఉన్నతాధికారులు స్పీడ్ గా అంతిమ యాత్రను కొనసాగించారు. స్మశాన వాటికలో కూడా కొద్ది మందిని మాత్రమే అనుమతించడంతో చాలా మంది అభిమానులు జేపీని చివరి చూపు చూడకుండా నిరుత్సాహంగా వెనుదిరిగినట్లుగా తెలుస్తోంది. జేపీకి పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పించారు.