జనతా గ్యారేజీ తేది మారింది !

443
Janatha garage
Janatha garage

టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే రిలీజైన సినిమా టీజర్, ట్రైలర్, పాటలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జనతా గ్యారేజీ’. ఇచట అన్నీ రిపేర్లు చేయబడును అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో సమంత, నిత్యమీనన్‌తోపాటు మళయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించిన దగ్గరి నుంచి ఆ తేదీ ఎప్పుడొస్తుందా! అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడో శుభవార్త. తొలుత అనుకున్న దాని ప్రకారం చిత్రాన్ని సెప్టెంబర్‌ 2న విడుదల చేయాల్సి ఉంది. కానీ అంతకు ఒకరోజు ముందే ‘జనతా గ్యారేజీ’ తలుపులు తీయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సీవీ మోహన్‌లు నిర్మిస్తున్నారు.