ఎన్టీఆర్, కొరటాల గ్రాండ్ కాంబినేషన్‌లో విడుదలకు రెడీ అవుతున్న జనతా గ్యారేజీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో యూత్‌ని ఓ రేంజ్‌లో ఊపేస్తోంది. సినిమా స్టార్టింగ్ నుంచి సెన్సేషన్స్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇంతకు ముందే వచ్చిన టీజర్ అభిమానుల హృదయాలను దోచుకుంది. ఇప్పుడు గ్యారేజ్ అభిమానుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ చేరిపోయారు.
అంతరించిపోతున్న అడవులను మళ్లీ సృష్టించడానికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో హరిత హారం అనే కార్యక్రమంతో పెద్ద ఎత్తున చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు కేసీఆర్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, 33% అడవులను డెవలప్ చేయాలని ఆయన సందేశాలు ఇచ్చారు. మంత్రులను భాగస్వాములు చేశారు. ఎమ్మెల్యేలను, అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు.
ఇక హరిత హారం పథకాన్ని ఎన్టీఆర్ జనతాలో తీశారట. ఎన్టీఆర్ తనవంతుగా మొక్కల గురించి కొంత ప్రచారం చేసినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. గ్యారేజ్ ట్రైలర్ ప్రకారం ఈ సినిమా పర్యవరణాన్ని కాపాడండి అనే గ్రేట్ మెసేజ్‌తో ఉందని దీనిని చూసిన అధికారులు అంటున్నారు. ఇదే విషయాన్నిఅధికారులు సీఎం కేసీఆర్‌కు కూడా వివరించారట. దీంతో సీఎం కేసీఆర్.. తను కూడా ట్రైలర్ చూసినట్టు తెలిసింది. హరితహారం కార్యక్రమం మరింత ప్రజల్లోకి వెళ్తుందని, ఇలాంటి సినిమాలు చాలా తక్కువగా ఉంటాయని అధికారులతో అన్నారట కేసీఆర్.
హరితహారానికి టాలీవుడ్ నుండి కూడా పెద్ద ఎత్తున్న స్పందన వచ్చింది. బాహుబలి టీమ్ తో సహా చాలా మంది నటీనటులు తమవంతుగా వీధుల్లో, పార్కుల్లోకి వచ్చి మొక్కలు నాటారు. ఇప్పుడు ఇలాంటి సందేశాన్నే ఎన్టీఆర్ తన గ్యారేజ్‌లో చూపించాడు.