జనతాగ్యారేజ్ కి బాహుబలి

450
SS Rajamouli praise Junior NTR, Mohanlal-starrer
SS Rajamouli praise Junior NTR, Mohanlal-starrer

టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి రెండో భాగం షూటింగ్‌లో రాజమౌళి బిజీగా ఉన్నా.. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘జనతాగ్యారేజ్’ సినిమాను హైదరాబాద్‌లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున సినీఫ్లెక్స్‌ కు వెళ్లి చూశారు.
ఎంత బిజీగా ఉన్న తనకు నచ్చిన సినిమాలను, తనకు కావలసిన వాళ్ల సినిమాలను తొలి రోజే చూసేయటం దర్శకధీరుడు రాజమౌళికి అలవాటు. అందుకే తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జనతా గ్యారేజ్ సినిమాను తొలిరోజే వరుసగా రెండు షోలు చూశాడు జక్కన్న. చిత్రయూనిట్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
‘జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్, మోహన్ లాల్ ల కాంబినేషన్, వారి నటన నాకెంతగానో నచ్చింది. వారిద్దరూ అద్భుతంగా నటించారు. టెంపర్ సినిమా తరువాత తారక్ ఎంచుకుంటున్న పాత్రలు, తన కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తీరు చూస్తే నాకు గర్వంగా ఉంది. నిజాయితీ గల ప్రభుత్వోద్యోగిగా నా మిత్రుడు రాజీవ్ కనకాల నటన మనసును తాకేలా ఉంది. వరుసగా రెండు సార్లు ఈ సినిమాను చూశాను’ అంటూ ట్వీట్ చేశారు.
రాజమౌళి ట్వీట్ చూసిన రాజీవ్‌ కనకాల తిరిగి ట్వీట్టర్‌ లో స్పందించారు. అభిమానంతో ట్టీట్ చే జక్కన్నకు ప్రణామం, ప్రణామాం అంటూ రాజీవ్ కనకాల తన ట్వీట్టర్ లో స్పందించారు.
రాజమౌళి ప్రకటనను చూసిన సినీ జనం… జనతా గ్యారేజ్‌ను రాజమౌళి రెండు సార్లు ఎందుకు చూశారా? అనే విషయంపై ఒక స్పష్టతకు వచ్చారు. తనకెంతో ఇష్టమైన హీరో జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒకసారి, తన మిత్రుడు రాజీవ్ కనకాల కోసం రెండోసారి చూసినట్లు చెప్పుకుంటున్నారు. వాళ్లు అలా చెప్పుకోవడంలో కూడా నిజం లేకపోలేదు. జనతాగ్యారేజ్ చూసిన రాజమౌళి… ఎన్టీఆర్, రాజీవ్‌కనకాల గురించి మాత్రమే ప్రస్తావిస్తూ ప్రశంసించారు. అందుకే సినీజనం ఈ విధంగా ఊహించుకున్నారు. మొత్తానికి రాజమౌళి రెండు సార్లు సినిమా చూసి జనతాగ్యారేజ్‌కు మరింత హైప్‌ను క్రియేట్ చేశారు.