టాలీవుడ్ టాప్ హీరోయిన్ అక్కినేని కుటుంబంలో చేరిపోయింది.. అవును నిజం.. సమంత అక్కినేని కుటుంబంతో కలిసిపోయింది. వాళ్లలో ఒకరిగా మారిపోయింది. అఫీషియల్ గా అక్కినేని ఫ్యామిలీతో కలిసి.. ఆ ఇంటి కోడలిగా వచ్చింది. నమ్మబుద్ధి కావట్లేదు కదూ..! టాలీవుడ్ లో కొన్ని రోజుల నుంచి వినిపిస్తోన్న వార్త నాగచైతన్య-సమంత పెళ్లి. వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం తెలుసు. కొంతకాలంగా అందరికీ తెలిసేలా తమ బంధాన్ని బయటపెట్టారు ఈ జంట. కానీ పెళ్లి విషయంపై మాత్రం నోరు విప్పలేదు. సమంత కాస్త హింట్ ఇచ్చింది కానీ చైతూ మాత్రం అస్సలు మాట్లాడలేదు. అయితే ఇప్పుడు వీళ్ల బంధానికి క్లైమాక్స్ వచ్చేసినట్లు తెలుస్తోంది. నాగచైతన్యతో సమంత ఏడడుగులు నడవడం కూడా కన్పర్మ్ అయిపోయింది.
టాలీవుడ్ అందాల జంట.. నాగచైతన్య, సమంత ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతికి, ఐటీసీ గ్రాండ్ కాకతీయ హోటల్ యజమాని శివకుమారెడ్డి కుమారుడు ప్రణవ్‌రెడ్డికి ఆదివారం వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ అందాల జంట అక్కడ ప్రత్యక్షమయింది. చైతూ, సమంత పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి అవుననో, కాదనో వారు తేల్చిచెప్పలేదు. సమంత తన మెడలో ‘ఎన్’ అనే అక్షరం లాకెట్ ధరించి, తన జీవితంలో ఎంతో ముఖ్యమైందని చెప్పడం తప్ప ఇద్దరూ కలిసి ఓ వివాహ వేడుకకు హాజరవడం ఇదే మొదటిసారి.
సమంత హీరోయిన్ గా కాకుండా.. ఒక సగటు మహిళగా రెడీ అయ్యి వచ్చింది.. ఈ పెళ్లి వేడుకలో చైతు.. సమంత ల జంటగా తిరుగుతూ.. సెంటరాఫ్ అట్రాక్షన్ నిలిచారు.. ఈ వేడుకలో సమంతను తనకు కాబోయే కోడలిగా అందరికీ పరిచయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది.. ఈ చూడ చక్కని జోడీ అని అందరూ వ్యాఖ్యానిస్తుండగా.. అఖిల్ కూడా తనకు కాబోయే వదినమ్మతో చాలా బాగా పెళ్లిని ఎంజాయ్ చేశాడు… నాగార్జున మనం సినిమా సమయం నుంచి సమంతని అమ్మ అనే పిలుస్తాడు అనే సంగతి విధితమే.. దీంతో వీరి ఫ్యామిలీ పిక్ ను చూసిన వారు అమ్మని కొడలిగా తీసుకొని రావడానికి అంగీకరించాడని.. మొత్తానికి చైతు.. సామ్ లు తమ ప్రేమను గెలిపించుకొన్నారని.. ఇక పెళ్లి సందడే మిగిలిందని అంటున్నారు.