చిరు బర్త్ డే పార్టీకి కేటీఆర్‌

189

మెగాస్టార్ చిరంజీవి 61వ బర్త్ డే వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి.తన బర్త్‌డేని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో కొందరు సినీ, రాజకీయ ప్రముఖులకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటీఆర్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్, మాస్ మహరాజా రవితేజ, శ్రీకాంత్, అఖిల్‌శర్వానంద్, కృష్ణవంశీ, రామ్‌చరణ్, వివి వినాయక్, శరత్ మరార్, దగ్గుబాటి సురేష్, అఖిల్, అల్లు అర్జున్, శిరీష్, ప్రగ్యా జైస్వాల్, రాఖీ ఖన్నా, నవదీప్ తదితరులు హాజరయ్యారు. ఈ బర్త్ డే పార్టీని సెలబ్రిటీలు ఫుల్‌గా ఎంజాయ్ చేయగా అందరు చిరుకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఖైదీ నెంబర్ 150 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని కోరారు.

chiru-bday9
అంతకముందు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా శిల్ప కళా వేదికలో ఏర్పాటు చేసిన వేడుకలకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీస్, నాగబాబు, అల్లు అరవింద్, వివి వినాయక్ తదితరులు పాల్గొని సందడి చేశారు.వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరు 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోండగా సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని యూనిట్ భావిస్తోంది.

chiru-bday5