చరిత్రలో ఈ రోజు

208
Highlight in History
- Advertisement -

(నవంబర్ 18, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.)

*సంఘటనలు*

1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు – నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.

*జననాలు*

1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)
1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు మరియు నటుడు. (మ.1990)
1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు మరియు రచయిత.
1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు మరియు సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.

*మరణాలు *

1962: నీల్స్ బోర్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)
1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు పాత్రికేయుడు. (జ.1904)
1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)

- Advertisement -