ఘనంగా కృష్ణా పుష్కరాల ముగింపు

532
Krishna pushkaralu
Krishna pushkaralu

తెలంగాణలో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. అన్ని పుష్కరఘాట్ల వద్ద నదీ హారతితో పుష్కరాలు ముగిశాయి. నదీ హారతి కార్యక్రమం అన్ని పుష్కరఘాట్ల వద్ద రాత్రి 7 గంటలకు జరిగింది. పన్నెండు రోజుల పాటు పుష్కరఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో పులకరించిపోయాయి. నదీ తీరంలోని ఆలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడాయి.

బీచుపల్లిలో కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఘాట్ల దగ్గర జరిగిన సంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ ఉత్సవాలలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా హాజరయ్యారు. అర్చకులు నేత్రపర్వంగా కృష్ణమ్మకు నవ హారతులు ఇచ్చారు. ఓంకార హారతి, నాగ హారతి, పంచ హారతి, కుంభ హారతి, సింహహారతి, నంది హారతి, సూర్య హారతి, చంద్ర హారతి, నక్షత్ర హారతులు ఇచ్చారు.

ఆగస్టు 12 నుంచి నేటి వరకు జరిగిన పుష్కరాల్లో 2 కోట్ల 50 లక్షల 98 వేల 831 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కోటి 80 లక్షల 11 వేల 801 మంది, నల్లగొండ జిల్లాలో 70 లక్షల 87 వేల 30 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు.