కోవ్యాక్సిన్….మరో ముందడుగు

27
covaxin

ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవ్యాక్సిన్ రెండో దశ క్లినికల్ ట్రయల్స్ కి భారత ఔషధ నియంత్రణా సంస్థ పచ్చ జెండా ఊపింది. జులై మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో కో వ్యాక్సిన్ తొలివిడత క్లినికల్ ట్రయల్స్ కి భారత ఔషధ నియంత్రణా సంస్థ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా 350మందికి పైగా తొలి విడత ట్రయల్స్ లో పాల్గొన్నారు. అయితే మొదటి దశలో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో రెండో విడత ప్రయోగాలకు అనుమతి ఇస్తున్నట్టు భారత ఔషధ నియంత్రణా సంస్థ పేర్కొంది. ఇక రెండో విడతలో 380మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు ఇస్తున్నట్టు తెలిపింది. కోవ్యాక్సిన్ కి సంబంధించి రాష్ట్రంలోని నిమ్స్ లో సైతం ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు.

జులైలో నిమ్స్ లో 50మందికి తొలి విడత డోస్ ఇచ్చిన వైద్యులు,వారికి తిరిగి 14రోజుల తర్వాత బూస్టర్ డోస్ ని సైతం ఇచ్చారు. ఇక రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ని సైతం త్వరలో నిమ్స్ లో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆరోగ్య వంతమైన వాలంటీర్ల రిజిస్ట్రేషన్లను త్వరలో ప్రారంభించనున్నారు.