కోటిన్నర పలికిన రెజీనా?

406
Actress Regina
Actress Regina

ఇప్పుడు టాలీవుడ్ అంతటా మారుమోగిపోతున్న పేరు ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా డస్కీ హాటీ రెజీనా కసాండ్రాదే అని చెప్పాలి. అయితే అమ్మడు ఏమీ ఇక్కడ బాహుబలి రేంజు హిట్టును కొట్టలేదు అంత టామ్ టామ్ అవ్వడానికి. మరెందుకు ఇంత క్రేజ్?

Search Results Actress Regina Cassandra

ఎప్పుడైతే అమ్మడు కనీసం ఆడిషన్ కూడా చేయకుండా బాలీవుడ్ లో ఒక ఆఫర్ పట్టేసిందో ఆ దెబ్బతో ఇక్కడ బాగా పాపులర్ అయిపోయింది.

Search Results Actress Regina Cassandra

అందం, అభినయం ఉన్న రెజీనా ఇప్పుడు బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. చేతి నిండా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి ఇప్పుడు బాలీవుడ్‌ ఆఫర్‌ వచ్చేసింది. అంతేకాదు అందులో ఏకంగా బిగ్‌బీ సినిమాలో ఛాన్స్‌ను కొట్టేసింది ఈ భామ. ఆంఖేన్‌ సినిమా సీక్వెల్‌లో నెగిటివ్‌ పాత్రలో నటించబోతుంది ఈ ముద్దుగుమ్మ.

Search Results Actress Regina Cassandra

ఇండ‌స్ట్రీలో కొంద‌రికి టైమ్ చాలా త్వ‌ర‌గా క‌లిసొస్తుంది. మ‌రికొంద‌రికి ఏళ్ల‌కేళ్ళు గ‌డిచిన త‌ర్వాత గానీ రాదు. రెజీనా రెండో టైపు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌దేళ్ళ త‌ర్వాత రెజీనాకు టైమ్ ట‌ర్న్ అయింది. త‌న త‌ర్వాత వ‌చ్చిన ర‌కుల్, రాశీ, స‌మంత‌, కాజ‌ల్ లాంటి ఎంద‌రో ముద్దుగుమ్మ‌లు స్టార్ హీరోయిన్లుగా చ‌క్రం తిప్పారు గానీ రెజీనా మాత్రం అలాగే ఉండిపోయింది. ఇన్నేళ్ళ త‌ర్వాత ఈ చెన్నై సుంద‌రి జాత‌కం మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం అమ్మాయిగారు తెలుగులో జ్యో అచ్చుతానంద‌, న‌క్ష‌త్రం సినిమాల్లో న‌టిస్తోంది. త‌మిళ్ లోనూ రెండు సినిమాల్లో న‌టిస్తుంది. ఇక ఈ మ‌ధ్యే బాలీవుడ్ లో అమితాబ్ బ‌చ్చ‌న్ తో ఆంఖే 2లో న‌టించే అవ‌కాశం అందుకుంది రెజీనా.
అన్ని భాష‌ల్లో క‌లిపి అర‌డ‌జ‌న్ సినిమాలు రెజీనా చేతిలో ఉన్నాయి. వీటిలో ఓ త‌మిళ సినిమా కోసం అమ్మ‌డు ఏకంగా కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌నే వార్త‌లు ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయి. క్రేజ్ ఉన్న‌పుడు క్యాష్ చేసుకోవ‌డంలో త‌ప్పులేదంటోంది రెజీనా. ఇన్నాళ్లూ త‌న కెరీర్ గాడిన ప‌డ‌ని స‌మయంలో త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.. ఇప్పుడు టైమొచ్చింది సంపాదిస్తున్నా.. త‌ప్పులేదంటోంది ఈ బ్యూటీ. మొత్తానికి ఇదే జోరులో రెండు హిట్లు ప‌డితే రెజీనా క‌ల‌లు క‌న్న స్టార్ హీరోయిన్ హోదా వ‌చ్చేస్తోంది.