అలీ కాంట్రవర్సి….

273
AGAIN! Ali Makes Uncouth Comments At SIIMA, Read more at: http://www.filmibeat.com/telugu/news/2016/again-ali-makes-uncouth-comments-at-siima-upsets-suhasini-232590.html
Lakshmi Manchu, Ali @ SIIMA Awards 2016 Singapore Photos

ఎంటర్ టైన్మెంట్ ఉంటేనే సినిమా అయినా.. సినిమా ఫంక్షన్ అయినా హిట్ అవుతుంది. అయితే హాస్యం ఎప్పుడూ ఎదుటి వాళ్లను నవ్వించే విధంగానే ఉండాలి కానీ.. నొప్పించే విధంగా ఉండకూడదు. అయితే ఇప్పుడు జరుగుతున్న అన్ని సినిమా ఫంక్షన్లలోనూ హీరోయిన్స్ పర్సనాలిటీతో పాటు.. పర్సనల్ ఇష్యూస్ ను కూడా ప్రస్తావిస్తూ కామెడీ పండించేందుకు యాంకర్స్ ట్రై చేస్తున్నారు.

ఒకప్పుడు ఇలాంటి ఛీప్ కామెడీ బాలీవుడ్ స్టేజ్ షోస్ లోనే ఎక్కువగా కనిపించేది. ఈ మధ్య మన కమెడియన్లు కూడా ఈ తరహా వినోదాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ విషయంలో బాగా రాటు తేలిన మన అలీ.. సినిమాల్లోనే కాదు.. సినిమా బయట కూడా హీరోయిన్లపై సెటైర్లు.. జోకులు వేయడం కామన్ అయిపోయింది. మనోడి వల్గర్ జోక్స్.. లాంగ్వేజ్ ప్రాబ్లెమ్ వల్ల కొంతమంది హీరోయిన్స్ ఎంజాయ్ చేస్తున్నా.. భాష తెలిసిన భామలు మాత్రం కొంచెంది ఇబ్బంది పడుతున్నారట….

700 పైగా సినిమాల్లో నటించాడు..తెలుగులో సీనియర్ కమెడియన్స్ లో ఒకడు.బాల్యనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ఇప్పటికి తెలుగు జనాల్ని తన మార్క్ కామెడీతో సినిమాల్లో అలరిస్తూనే వున్నాడు.అర్థమైవుంటుందనుకుంటా తనెవరో కాదు ఆలీనే అని.అలీ చేసే కామెడీ కంటే అతను చేసే కాంట్రవర్సీ నే ఎక్కువగా మాట్లాడుతోంది ఈ మధ్య.

ఆ మధ్య అన్నపూర్ణ సుంకర అనే ఒక అమ్మాయి అమెరికా నుండి అలీ చేసే పచ్చి పిచ్చి కామెంట్స్ పైన విపరీతంగా స్పందించి సంచలనం రేపింది.ఆ దెబ్బ ఆలీకి బాగానే తగిలింది.ఎంతగా అంటే దొరికిన టీవీ చానెల్స్ అన్నిటికి వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.అంతేనా తెలిసిన నటీ నటులందరితో అలీ మంచోడు అని సర్టిఫికెట్ ఇచ్చుకోవాల్సివచ్చింది.

`క‌మెడీయ‌న్ అలీ అన‌డం కంటే కాంట్ర‌వ‌ర్సీ అలీ` ఇది ఆయ‌న‌కు బాగా న‌ప్పుతుందేమో! ఎందుకంటే `స‌మంత న‌డుము బెజ‌వాడ బెంజి సర్కిల్‌లా ఉంటుంది.. అబ్బా అనుష్క తొడ‌లు.. అంటూ హీరోయిన్ల‌పై కామెంట్లు చేసి మరింత వివాదాస్ప‌దంగా మారిపోయాడు. వీటిపై తీవ్ర నిర‌స‌న‌లు రావ‌డంతో `ఇక యాంక‌రింగ్ చేయ‌ను` అని చెప్పాడు. ఇక `అలీ మారిపోయాడులే` అనుకున్నారు. కానీ అలా అనుకున్న‌వారికి `సైమా` వేదిక‌గా పెద్ద షాక్ ఇచ్చాడు అలీ. త‌న‌లో పాత అలీ ఇంకా మాయ‌మైపోలేద‌ని రుజువుచేసి మ‌రోసారి తన `బూతు` పురాణాన్ని బ‌య‌ట‌పెట్టాడు.

క‌మెడీయ‌న్ అలీ యాంక‌ర్‌గా మారిపోయాడు. స‌ర‌దాగా కాసేపు అల‌రిస్తాడ‌నుకుంటే త‌న డ‌బుల్ మీనింగ్ డైలాగుల‌తో హీరోయిన్ల‌పై కామెంట్లు చేస్తూ వివాదాల‌కు బిందువ‌య్యాడు. తాజాగా సింగపూర్ లో జరిగిన సైమా అవార్డ్స్ ఫంక్షన్స్ కి ఆలీ.. మంచు లక్ష్మితో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

ఈ ప్రోగ్రాం ని టీవీ ల్లో చూస్తున్నంత సేపు ఎప్పుడెప్పుడు అలీ మాట్లాడటం మానేస్తాడా అనిపించేంతగా బూతుపురాణం పఠించాడు. ఏ ఒక్కరినీ వదల్లేదు..అందరిమీద బూతు జోకులే..వాటికి నవ్వాలో..ఏడవాలో అర్థం కాదు..సీనియర్ జూనియర్ ఆడా మగా అని తేడా లేదు..ఎవరికి ఎవరితో లింకులేసి మాట్లాడుతున్నాడో అర్థం కానంత మైకం లో బూతు స్మరణయే చేసాడు సైమా ఫంక్షన్ అంతా.

అయినా అలీ సినిమాల్లో మంచి ఆక్టర్ అయ్యుండొచ్చు,నిజజీవితం లో మంచి మనిషే అయ్యుండొచ్చు..వాటన్నిటికీ మించి పది మంది ముందు ఎంత పద్దతిగా మాట్లాడామన్నదే వాటికంటే గొప్ప గుణం.మన మాటలు విన్న వారు చుసిన వారు సిగ్గుతో తలదించుకునేంత అవమానకరంగా మాట్లాడే మనిషి ఎంత మంచివాడైతే ఎందుకు.నవ్వించడానికి నవ్వులపాలు చేయడానికి చాలా చిన్న వెంట్రుక వాసి తేడా ఉంటుంది..ఆ తేడా ఆలీకి ఎప్పుడు తెలుస్తుందో ఏమో.