కొద్దిరోజులుగా మళ్లీ ఎండకాలాన్ని తలపించిన ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మెహదీపట్నం, టోలీచౌకితో పాటు నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ మండలంలోనూ పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరంలో వాతావరణంఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదరకంగా మారిపోయింది.
వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు ఆవర్తనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడుగా ఈనెల 26న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గురువారం పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. శక్రవారం ప్రత్యేకించి ఉత్తర కోస్తాలో పలుచోట్ల విస్తారంగా, శనివారం కోస్తా, తెలంగాణ లోని కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి.