ఓటీటీలో లేడీ సూపర్‌ స్టార్‌ మూవీ..

51
Nayanthara

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార దక్షిణాదిలో నెంబర్ వన్ కథానాయికగా దూసుకుపోతుంది. దక్షిణాదిలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్ నయన్‌. కొంతకాలంగా ఆమె నాయిక ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తుంది. అలా ఆమె చేసిన సినిమానే ‘నేత్రికన్’. ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపిస్తుంది. అందమైన అమ్మాయిలను వేటాడి వరుస హత్యలు చేసే ఒక కిల్లర్ బారి నుంచి నాయిక ఎలా తప్పించుకుంది? ఆ కిల్లర్ కథకి ఆమె ఎలాంటి ముగింపు పలికింది? అనేదే ఈ చిత్ర కథ.

ఇక ఈ సినిమా ‘డిస్నీ హాట్ స్టార్’ ద్వారా విడుదల కానుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే దీనిపై చిత్ర బృందం స్పందించకపోవడంతో అందులో నిజం లేదనుకున్నారు. అయితే హాట్ స్టార్ గురువారం ఓటీటీ రిలీజ్ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా వెల్లడించే అవకాశం ఉంది. కాగా ‘గృహం’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మిలింద్ రౌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో అన్ని పాటలను విగ్నేస్ రాయడం విశేషం. ఇక హాట్ స్టార్ వారు ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.