రాష్ట్రంలో అక్రమంగా తిరుగుతున్న లారీలు, ప్రైవేట్ వాహనాలపై చర్యలు తీసుకుంటాన్నారు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర, జిల్లా రవాణాశాఖ అధికారులతో మంత్రి మహేందర్ రెడ్డి సమీక్ష నిర్విహించారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓవర్ లోడ్ లారీలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.
ప్రైవేట్ బస్సులను ఓఆర్ఆర్ రింగ్ రోడ్డు బయట నిలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓఆర్ఆర్ నుంచి సీటి లోపలికి ఆర్టీసీ సర్వీసులు నడిపిస్తామని చెప్పారు. అద్దె భవనాలు ఉన్నా పక్కా భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఆర్టీసీ, రవాణా శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక దృష్టి సారించమని తెలిపారు. త్వరలో పూర్తిస్థాయి రవాణాశాఖ కమిషనర్ ను నియమిస్తాని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.