‘ఓం నమో వెంకటేశాయ’ ఫస్ట్‌ లుక్‌ 

489
First Look: Nagarjuna in Om Namo Venkatesaya
First Look: Nagarjuna in Om Namo Venkatesaya
అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి అందిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనదైన శైలిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. కాగా, ఆగస్ట్‌ 29 అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్‌ బాబా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, అనుష్క శెట్టి, సౌరబ్‌ జైన్‌, జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.