ఓంకార్ తో అంజలి…

215
Anjali to Act in Raju Gari Gadhi Sequel Movie
Anjali to Act in Raju Gari Gadhi Sequel Movie

హార‌ర్, థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు చిరునామాగా నిలిచింది అంజ‌లి. గీతాంజ‌లితో ఆ త‌ర‌హా క‌థ‌ల్లో ఆమెనే క‌థానాయిక‌గా ఎంచుకొంటున్నారు. తాజాగా మ‌రో దెయ్యం క‌థలో న‌టించ‌డానికి అంజ‌లి ఒప్పుకొంద‌ని టాక్‌.

ఫిల్మ్ ఇండస్ట్రీలో సత్తా చాటాలనుకుంటున్న యంగ్ డైరెక్టర్స్ లో ఓంకార్ ఒకరు. ‘రాజుగారి గది’ మూవీతో ఓంకార్ కి టాలీవుడ్ మార్కెట్ లో ఓ బ్రాండ్ ఏర్పడింది. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని విధాలుగా అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఓంకార్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక ఫాంలో ఉన్నప్పుడే మరో మూవీతో ముందుకు రావాలని ఓంకార్ భావించాడు.

అందుకే రాజుగారి గది పేరు ఇంకా ప్రేక్షకులు మరచిపోకుండా ఉన్నప్పుడే, దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేశాడు. ఇక ఈ సీక్వెల్లో క్రేజీ హీరోయిన్ అంజలి నటించనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అంజలితో మూడు సార్లు ఓంకార్ కలిసాడు. రాజుగారి గది సీక్వెల్ కి సంబంధించిన కథని అంజలికి ఓంకార్ చెప్పటం, అందుకు అంజలి సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగాయని అంటున్నారు.

గతంలో ఓంకార్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ గా ‘రాజుగారి గది’ సీక్వెల్లో ఫిమేల్ ని లీడ్ రోల్ గా వాడుకోవాలని ఓంకార్ భావిస్తున్నాడు. అందుకే అంజలిని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో అంజలితో ఓంకార్ చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని అంటున్నారు. అంతే కాకుండా అంజలికి, ఓంకార్ భారీ రెమ్యునరేషన్ ని ఇవ్వనున్నాడని అంటున్నారు. దాదాపు కోటి రూపాయల వరకూ రాజుగారి గది సీక్వెల్ కోసం అంజలి రెమ్యునరేషన్ గా తీసుకుంటుందని అంటున్నారు.

ఇంత రెమ్యునరేషన్ ఇస్తాను అంటే, ఎవరైనా ఒప్పుకోక ఏం చేస్తారు మరి!.. సో.. రాజుగారి గ‌దిలో అంజ‌లి కూడా అడుగుపెట్ట‌బోతోంద‌న్న‌మాట‌. రాజుగారి గదిని సూపర్ సక్సెస్ చేసిన ఓంకార్.. ఆ మ్యాజిక్ ను సీక్వెల్ లో రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.