ఒలింపిక్స్‌లో మరియప్పన్‌కు స్వర్ణం..

718
mariyappan-thangavel
- Advertisement -

రియోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.పురుషుల హైజంప్‌ విభాగంలో మరియప్పన్‌ తంగవేలు స్వర్ణం సాధించగా, మరో భారత అథ్లెట్‌ వరుణ్‌సింగ్‌ భాటి ఇదే పోటీలో కాంస్యం దక్కించుకున్నాడు. దీంతో పురుషుల హైజంప్‌ టీ-42 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. పారాలింపిక్స్‌లో హైజంప్‌లో స్వర్ణం దక్కించుకున్న తొలి భారత అథ్లెట్‌గా మరియప్పన్‌ రికార్డు సృష్టించాడు.

Mariyappan-Thangavelu

మరియప్పన్‌ 1.89మీటర్లు హైజంప్‌ చేసి తొలి స్థానంలో నిలవగా.. వరుణ్‌ సింగ్‌ 1.86 మీటర్ల హైజంప్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. అమెరికాకు చెందిన శామ్‌ గ్రీవే రజతం దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన మరో అథ్లెట్‌ శరద్‌ కుమార్‌ హైజంప్‌లో ఆరో స్థానంలో నిలిచాడు.

మరియప్పన్‌ స్వర్ణం సాధించడంతో తమిళనాడు ప్రభుత్వం రూ.2 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. నిన్న రియోలో జరిగిన పారా ఒలింపిక్స్ హైజంప్‌లో ఆయన స్వర్ణ పతకం గెలిచినందుకు ఈ రివార్డును ప్రకటించింది. రియోలో భారత కీర్తి పతకాన్ని ఎగరవేసినందుకు ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్టు పేర్కొంది. 20ఏళ్ల మరియప్పన్‌ తమిళనాడులోని సేలెంకు సమీపంలో ఉన్న చిన్న గ్రామం పెరివడగాంపట్టి నుంచి వచ్చాడు. ఐదేళ్ల వయసులో బస్సు ప్రమాదంలో కుడి కాలు కోల్పోయాడు. కాంస్యం గెలుచుకున్న వరుణ్‌సింగ్‌ భాటికి పోలియో కారణంగా ఒక కాలు పనిచేయదు.

Sam-Grewe-Mariyappan-Thagavelu-Bhati-Varun-SinghGetty-Images

భారత క్రీడా మంత్రిత్వ శాఖ గతంలోనే పారాలింపిక్స్‌లో పతకాలు తెచ్చిన వారికి నజరానాలు ఇస్తామని ప్రకటించింది. స్వర్ణ పతకానికిరూ.75లక్షలు, రజతానికి రూ.50లక్షలు, కాంస్య పతకం తెచ్చిన వారికి రూ.30లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది.

Mariyappan Thangavelu1

- Advertisement -