ఎన్టీఆర్ వీక్ నెస్ ఇదేనా?..

272
Samantha Teasing NTR
Samantha Teasing NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి జంటగా సమంత-నిత్యామీనన్ లు నటించిన మూవీ జనతా గ్యారేజ్. ఇచట అన్ని రిపేర్లు చేయబడును అనే క్యాప్షన్ కూడా తగిలించుకున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్‌ లో భాగంగా హీరో, ఎన్టీఆర్, హీరోయిన్‌ సమంత, దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో సమంత ఎన్టీఆర్‌పై ఓ సంచలన కామెంట్‌ కూడా చేసింది.

ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ ఏదో చెబుతుండగా సమంత జోక్యం చేసుకోవడం అతనికి నచ్చలేదు.. అంతే.. వెంటనే ఆ ఇంటర్వ్యూ మధ్యలోనే లేచి వెళ్లాడు. అయితే ఇదంతా సరదగానే నడిచింది.

janatha garage, ntr, samantha

అయితే ఇంతకు ఎన్టీఆర్‌ ఆ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే ఎందుకు వెళ్లబోయాడు? మళ్లీ వెనకకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు? ఎన్టీఆర్‌ను సమంత ఏమంది?…. అసలు ఏం జరిగిందంటే.. యాంకర్‌ శ్యామల అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్‌ మాట్లాడుతూ నాకు, సమంతకి మధ్య ఉన్న స్నేహం కారణంగా గ్యారేజ్‌ లో తమ మధ్య రొమాంటిక్‌ యాంగిల్‌ బాగా వర్కవుట్‌ అయింది. అని ఎన్టీఆర్‌ చెబుతుండగానే.. సమంత జోక్యం చేసుకుంది. రొమాంటిక్‌ యాంగిల్‌ లో ఆయన ఇన్‌పుట్‌ ఏమి లేదు. అసలు ఈయన రొమాంటిక్‌ హీరో కాదు.. అని చెప్పింది..

janatha garage, ntr, samantha

అంతే.. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఎన్టీఆర్‌ అసలు నన్ను మాట్లాడనిస్తారా? లేదా? అంటూ ఇంటర్వ్యూ మద్యలోంచే లేచి బయటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో యాంకర్‌ శ్యామల వెంటనే ఎన్టీఆర్‌ను రిక్వెస్ట్‌ చేసి వెనక్కి రప్పించింది. దీంతో ఎన్టీఆర్‌ మళ్లీ వెనక్కి వచ్చి… మాట్లాడుతూ నాలో అసలు రొమాంటిక్‌ యాంగిలే లేదండి… అని చెప్పగా.. ఇప్పుడు నిజం చెప్పారు. అంటూ సమంత చెప్పింది.. చాలా ఎంటర్‌ టైనింగ్‌ గా సాగిన ఈ ఎపిసోడ్‌ మీరూ ఓ సారి చూసి.. ఎంజాయ్‌ చేయండి..