ఎన్టీఆర్‌ అంటే ఇంత ప్రేమా?….

240
Janatha Garage Fans Show Updates
Janatha Garage Fans Show Updates

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసుకుంటుంది. ఈ మధ్యనే ఈ సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్‌ 1నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా  టీజర్ రిలీజ్ అయిపోయింది. రంజాన్ శుభాకాంక్షలు చెబుతూ.. టీజర్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. ‘జనతా గ్యారేజ్’ మూవీలో చిన్న రామారావు లుక్స్ అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.

“బలవంతుడు, బలహీనుడిని భయపెడుతూ బతకడం ఆనవాయితీ.. బట్ ఫర్ ఏ ఛేంజ్.. ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలం ఉంది.. జనతా గ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంతా, నిత్యామీనన్ నటిస్తున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మిర్చి, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ను అందించిన కొరటాల డైరెక్షన్లో వస్తున్న మూడో సినిమా ఇది.

మరోవైపు ఈ సినిమా సమాజానికి ఓరియెంటెడ్‌ మెసేజ్‌ను కూడా ఇవ్వబోతోందని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హరితాహారం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

భారీ అంచనాలతో ఎన్టీఆర్‌కు హాట్రిక్‌ విజయం సాధించిపెడుతుందనే నమ్మకంతో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ , సినీ అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్‌ అభిమానులు ఎన్టీఆర్‌పై తమ ప్రేమను పలు రకాలుగా చాటుకుంటున్నారు. పోస్టర్లు, ప్లెక్సీలతో హడావిడి చేస్తుంటారు.

తమ అభిమాన నటుడి సినిమా విడుదలైతే చాలు..అభిమానుల ఆనందానికి అడ్డు ఉండదు. థియేటర్ల దగ్గర హడావుడి అంతా ఇంత ఉండదు. డప్పులు, రంగులు చల్లుకుంటూ తమ అభిమానం ఎలా ఉందో చూపిస్తుంటారు.

అందులో భాగంగానే ఓ అభిమాని ఎన్టీఆర్‌పై తమ ప్రేమను ఈ విధంగా చాటుకున్నాడు. తన ముఖంపై, చాతిపై ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్‌ అని పచ్చబొట్టుతో రాయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు.