ఉదయభానుకు అమెరికాలో అవమానం?

492
Udayabhanu with Baby Bump
Udayabhanu with Baby Bump

ఉదయభాను యాంకరింగ్ చేస్తూ స్టేజ్ పై ఉంటే ఏ రేంజ్ హంగామా చేస్తుందో తెలిసిన విషయమే. టీవీల్లోనూ.. స్టేజ్ లపైనా ఓ రేంజ్ లో అల్లరి చేసి మెప్పించచ్చని తెలియచెప్పింది ఈమే. అయితే.. ఇప్పుడీమె ఓ ఏడాదిగా కనిపించడం లేదు. ఇందుకు కారణం.. ప్రస్తుతం ఉదయభాను ప్రెగ్నెంట్ కావడమే. దానికి కారణం తాను ఇప్పుడు గర్భవతినని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. తనను ఓ సింగర్‌ గతంలో అవమానించిన విషయం కూడా ఇప్పుడు బయటపెట్టింది.

అయితే.. పరిశ్రమలో నాకు ఫ్రెండ్స్ తక్కువ అంటోందీ యాంకర్. ఎదుటి వాళ్లను అవమానించేందుకు కూడా చాలామంది వెనకాడరట. అలాంటి అనుభవాలు చాలానే ఉన్నా.. ఓ సింగర్ కారణంగా ఫేస్ చేసిన పరిస్థితి మర్చిపోలేకపోతోందట ఉదయభాను. యూఎస్ లో జరిగిన ఓ ఈవెంట్లో ఇద్దరూ పాల్గొనగా.. చివరి రోజున ఈ యాంకర్ ని ఆ సింగర్ స్టేజ్ పైకి పిలవలేదట. ఆఖరికి యాంకర్లపై జోకులు వేస్తూ ఓ స్కిట్ ప్లే చేస్తే.. వాళ్లతో పిలిపించారట. ఆ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు అందిరకీ థ్యాంక్స్ చెప్పేందుకు కూడా ఉదయభానును స్టేజ్ పైకి ఆహ్వానించలేదట.
గతంలో యూఎస్ లో జరిగిన ఓ ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించా. అప్పుడు టాలీవుడ్ కు చెందిన ఓ ఫేమస్ ఫిమేల్ సింగర్ నన్ను అవమానించింది. ఆమెను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు నేను ఎంతో గొప్పగా ఆమె గురించి చెప్పేదాన్ని.
కానీ, ఆ టూర్ చివరి రోజున ఆమె ముందు స్టేజ్ మీదకు వెళ్లి నన్ను పిలుస్తానని చెప్పింది. అందరినీ పిలిచింది కానీ, నన్ను మాత్రం పిలవలేదు. ఆఖరుకి నా అంతట నేనే వేదిక పైకి వెళుతుండగా, ఆ సింగర్ కు చెందిన ఆర్కెస్ట్రా ఓ నీరసపు ట్యూన్ ప్లే చేసి నన్ను మరింత అవమానించారు. తర్వాత ఆ సింగర్ నాకు ఏదో సర్ది చెప్పబోయింది. కానీ, నేను పట్టించుకోలేదు అంటూ ఉదయభాను చెప్పుకొచ్చింది.
తను యాంకర్ కావడంతో.. తనే స్టేజ్ పైకి వెళ్లి మళ్లీ ఎప్పుడూ ఈ ఈవెంట్ కి రానని తెగేసి చెప్పిందట ఉదయభాను. మొత్తానికి ఈ యాంకర్ లో కామెడీ సెన్స్.. సెన్సాఫ్ హ్యూమర్ మాత్రమే కాదు.. అవమానిస్తే అక్కడికక్కడే రిటార్ట్ ఇచ్చే లక్షణాలు కూడా ఉన్నాయన్న మాట.