ఈ స్కూటర్ కిందపడదు..

505

పెనుభూతంలా తరుముకొస్తున్న వాయుకాలుష్య భయంతో ఎకో, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో కొత్త కొత్త రకాల స్కూటర్లు, కార్లు సందడి చేస్తున్నాయి. తాజాగా కింద పడని స్కూటర్‌ మార్కెట్లోకి వచ్చింది. ఎలాంటి ప్రమాదం జరిగిన ఈ స్కూటర్ కిందపడదు. ఇదే దీని ప్రత్యేకత.

c1_03-29-121
అమెరికా కంపెనీ లిట్ మోటార్స్ ‘సీ1’ అనే ఈ సరికొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. చూడటానికి కారులా ఉండే ఈ స్కూటర్‌కు డోర్లు అమర్చారు. ఇది 100 శాతం విద్యుత్‌తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిమీలు ప్రయాణిస్తుంది. ఎక్కువ వోల్టేజీ ఉన్న డీసీ కరెంటుతోనైతే ఆరగంటలో 80 శాతం బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. కారుకంటే పదోవంతు తక్కువ విడిభాగాలున్న సీ1 నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువట! మరో రెండేళ్లలో అందుబాటులోకి రానున్న సీ1 ధర దాదాపు రూ.16 లక్షల పైమాటే

images

ఈ స్కూటర్ ప్రత్యేకతలు:

()గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లొచ్చు.
()ఒకసారి చార్జింగ్ చేస్తే దాదాపు 200 మైళ్లు ఆగకుండా సాగిపోవచ్చు.
()కేవలం 6 సెకన్లలో 0 నుంచి 60 ఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.
()ట్రాఫిక్‌లో రయ్‌మంటూ దూసుకుపోయేలా నాజూగ్గా రూపొందించారు.
() బైక్‌ను పార్కింగ్ చేసినంత స్థలంలోనే పార్క్‌ చేయవచ్చు.

maxresdefault