ఈనెల 29న ‘ఒక్కడొచ్చాడు’ టీజర్

424
Tamanna and Vishal pairing for first time.
Tamanna and Vishal pairing for first time.
మాస్‌ హీరో విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ఎం.పురుషోత్తమ్‌ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఇటీవల ఫైట్‌ మాస్టర్‌ కనల్‌కణ్ణన్‌ సారథ్యంలో కోటిన్నర రూపాయల వ్యయంతో ఓ భారీ ఛేజ్‌ని షూట్‌ చేశారు. ఈ ఛేజ్‌ చిత్రానికే ఓ హైలెట్‌ కానుంది. అలాగే నృత్య దర్శకుడు దినేష్‌ నేతృత్వంలో మాస్‌ హీరో విశాల్‌పై ఇంట్రడక్షన్‌ సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి హిప్‌ ఆప్‌ తమిళ్‌ సంగీతం అందిస్తున్నారు.
రష్యాలో సాంగ్స్‌ పిక్చరైజేషన్‌!! 
నిర్మాత జి.హరి మాట్లాడుతూ – ”విశాల్‌-తమన్నా కాంబినేషన్‌లో ‘ఒక్కడొచ్చాడు’ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా వుంది. విశాల్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ మూవీ. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, అద్భుతమైన మ్యూజిక్‌లతో పాటు ఆల్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న చిత్రం ఇది. సెప్టెంబర్‌ 3 నుండి రష్యాలో బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరిస్తాం. విశాల్‌ బర్త్‌డే ఆగస్ట్‌ 29 సందర్భంగా టీజర్‌ని రిలీజ్‌ చేస్తాం. దర్శకుడు సురాజ్‌ టేకింగ్‌ మార్వలెస్‌. డెఫినెట్‌గా తెలుగులో విశాల్‌ రేంజ్‌ని మరింత పెంచే చిత్రం అవుతుంది. అక్టోబర్‌ 9న ఆడియో విడుదల చేసి, దీపావళి సందర్భంగా సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం” అన్నారు.
విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రంలో ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నారు. సంపత్‌రాజ్‌, చరణ్‌, జయప్రకాష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌, మాటలు: రాజేష్‌ ఎ.మూర్తి, పాటలు: డా|| చల్లా భాగ్యలక్ష్మీ, ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ, డాన్స్‌: దినేష్‌, శోభి, సహనిర్మాత: ఇ.కె.ప్రకాష్‌, నిర్మాత: జి.హరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురాజ్‌.