అసహనంతో పవన్

417

ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల హక్కని…దానిని కాలరాయోద్దని పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతిలో జరిగిన జనసేన బహిరంగసభలో మాట్లాడిన పవన్‌…ప్రత్యేక హోదా కోసం బీజేపీ మాట మార్చడం సరికాదన్నారు. కేంద్రమంత్రులు వెంకయ్య,జైట్లీ హోదాపై ఇచ్చిన మాట తప్పవద్దని….గతంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలో మాట్లాడిన వెంకయ్య…ఇప్పుడు మాట తప్పడం సరికాదన్నారు. వెంకయ్య,జైట్లీ అంటే గౌరవం ఉందని…తమ ఆశలపై నీళ్లు చల్లోద్దని పవన్ సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరితో అసహనంతో ఉన్నాని తెలిపారు.

ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించడానికి గో సంరక్షణ అంశాన్ని తెరమీదకు తీసుకువస్తున్నారని తెలిపారు. గోమాత పేరుతో ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించవద్దన్నారు. తనకు అసహనంతో ఉన్నానని తెలిపారు. బీజేపీకి గో సంరక్షణ మీద అంత శ్రద్ధ ఉంటే…బీజేపీ కార్యకర్తలకు,గోసంరక్షణ నేతలను ఇంటికో ఆవును పెంచుకోమని సూచించాలని చురకలంటించారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్‌ను స్తంభింపచేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. హోదాపై వెనక్కి తగ్గితే సీమాంధ్రుల పౌరుషం చూస్తానని పవన్ హెచ్చరించారు.మోడీ కోసమో….చంద్రబాబు కోసమో జనసేన పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. మాట ఇస్తే తప్పనని….యువత,ప్రజల జీవితాల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు.