అవంటేనే నాకిష్టం..!

257
i-am-very-good-taking-criticism
i-am-very-good-taking-criticism

మొన్న ‘కబాలి’లో సూపర్‌ స్టార్‌కు జోడీగా నటించిన బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే..  త‌న‌కు విమర్శలంటేనే ఇష్టమ‌ని, అందుకే వాటిని ఆనందంగా స్వీక‌రిస్తాన‌ని తెలిపింది.  రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించిన ‘రక్తచరిత్ర’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. అప్పట్నుంచి విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనలోని నటిని బయటపెడుతోంది. తాజాగా ఈ అమ్మ‌డు మీడియాతో మాట్లాడుతూ త‌న గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పింది.

తనకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు తనపై విమర్శలు చేస్తారని, అందుకే విమర్శల్ని స్వీకరించేందుకు తాను ఎప్పుడూ సిద్దంగానే ఉంటానని రాధిక పేర్కోంది. అయితే అందరిని లెక్కలోకి తీసుకోనని, తప్పులను ఎత్తిచూపుతూ త‌న‌పై చేసే విమర్శలకే తాను ప్రాధాన్యమిస్తాన‌ని తెలిపింది. తన సినిమా ‘బాగుంది’ అని చెప్పేవారి కంటే, త‌న‌లోని లోపాల‌ను ఎప్పటికప్పుడు చెప్పేవారంటేనే త‌న‌కి ఇష్టమ‌ని ఆమె చెప్పింది.

అటువంటి విమ‌ర్శ‌ల‌తో త‌ప్పుల‌ను స‌రిచేసుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, నటనను మ‌రింత బాగా చేసేందుకు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని రాధికా ఆప్టే పేర్కొంది. ఇండస్ట్రీ త‌మ‌ను ఎంతో ప్రోత్స‌హిస్తుంద‌ని, దానికి తగ్గట్టే త‌మ‌లో పోటీతత్వం ఉంటుందని ఆమె చెప్పింది. సినీప‌రిశ్ర‌మ‌లో త‌న‌కు మంచి ఫ్రెండ్స్‌ ఉన్నారని, వారు త‌న‌ను ప్రోత్స‌హిస్తున్నార‌ని పేర్కొంది.

‘‘ఎందుకంటే మన తప్పులను వెంటనే సరిచేసుకునే అవకాశముంటుంది. ఇలాంటి విమర్శలు నటనలో మెరుగుపడటానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇండస్ట్రీ మనకు చాలా సపోర్ట్‌ ఇస్తుంది. అలాగే దానికి తగ్గట్టుగానే పోటీతత్వం కూడా ఉంటుంది. ’’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా ఆప్టే. అయితే అదృష్టవశాత్తూ ఇండస్ట్రీలో తనకు  కొందరు మంచి స్నేహితులు కూడా ఉన్నారని వారి ప్రోత్సాహంతోనే తాను సినిమాల్లో నిలదోక్కుగోగల్గుతున్నానని రాధిక వివరించింది.

ఇక తన న్యూడ్‌ వీడియోను కళ్లార్పకుండా చూసిన వారే ఆ తర్వాత విమర్శలు చేస్తున్నారు అని ఈ హాట్ బ్యూటీ మండిపడుతోంది. న్యూడ్‌ వీడియో అంటే ఇష్టంతో చూసి, ఆ తర్వాత విమర్శలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని, తన వృత్తి ధర్మం పాటించి నటించాను తప్ప, తనకు తప్పుడు ఉద్దేశ్యం ఏమీ లేదు అని ఈ భామ చెప్పుకొచ్చింది. అంతే కాదు ముందు ముందు ఇలాంటి సీన్స్‌లో నటించేందుకు ఏ మాత్రం వెనుకాడను అని తెగేసి చెప్పింది.