అమ్మకు సుప్రీం మొట్టికాయలు…

180

పరువునష్టం కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంలో ఎదురుదెబ్బతగిలింది. రాజకీయ ప్రత్యర్థులపై పరువునష్టం దావాలను ఒక ఆయుధంగా వినియోగించుకోరాదని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హితవు చెప్పింది. ఇలాంటవి ప్రజాస్వామ్యానికి అపఖ్యాతి తీసుకొస్తాయని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఆకాంక్షలు, భిన్నాభిప్రాయాలు, విమర్శలు, అసమ్మతి, సహనం వంటి ప్రాథమిక అంశాలతో కూడుకొన్నదని, తమకు నచ్చని అంశాలను ప్రజలు విమర్శల ద్వారానే వ్యక్తీకరిస్తారని పేర్కొంది. విమర్శలపట్ల సహనం వహించకుండా అదేపనిగా ప్రభుత్వం పరువునష్టం కేసులు వేయడం తగదని చెప్పింది. అసమ్మతి గొంతు నొక్కరాదని, ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించేవారిపై ఐపీసీలోని 499,500 సెక్షన్ల కింద పరువు నష్టం కేసులు పెట్టడం కలవరపరిచే అంశమని వ్యాఖ్యానించింది.

డీఎండీకే అధినేత విజయకాంత్ దంపతులు 2005 నవంబర్‌లో జయలలిత ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నదని ఆరోపించారు.దీంతో తిరుపూర్ జిల్లా కోర్టులో ప్రభుత్వం వారిపై పరువునష్టం దావా వేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో స్థానికకోర్టు విజయకాంత్ దంపతులపై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం స్టే విధించింది.