అపార్ట్‌మెంట్‌ పాటలు

474

శ్రీ క్రియేటివ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో, నిఖిత ప్రధాన పాత్రలో శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ నిర్మించిన సస్పెన్స్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘అపార్ట్‌మెంట్‌’. సంగీత దర్శకుడు ఖుద్దూస్‌ ఎస్‌.ఎ. సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియోని ప్రముఖ నటుడు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ మరియు దర్శకుడైన ఆర్పీ పట్నాయక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆర్పీ పట్నాయక్‌ మాట్లాడుతూ..’పాటలు విన్నాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధించి, యూనిట్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఖుద్ధూస్‌ గురించి నాకు బాగా తెలుసు. బాగా కష్టపడతాడు. ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తున్నాను..’ అని అన్నారు.
దర్శకుడు శివగంగరాజు వుడిమూడి మాట్లాడుతూ..’ఒక అపార్ట్‌మెంట్‌ కల్చర్‌లోకి ఎంటరైన ఒక అమ్మాయి..అక్కడ ఎలాంటి అనుభవాలను ఫేస్‌ చేసింది అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇది నా మొదటి సినిమా. నిర్మాతకు ఋణపడి ఉంటాను. అలాగే సంగీత దర్శకుడు మంచి పాటలతో పాటు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఇచ్చాడు..తప్పకుండా ఈ చిత్రం మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను..అన్నారు.

నిర్మాత ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ మాట్లాడుతూ..’దర్శకుడు తొలి చిత్రమే అయినా..చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ చిత్రానికి సహకరించిన నటీనటులకు, టెక్నీషీయన్స్‌కి నా కృతజ్ఞతలు. ఖుద్ధూస్‌ మంచి సంగీతాన్ని ఇచ్చాడు. సినిమా బాగా వచ్చింది. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వారు ఈ చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది..అని అన్నారు.

సంగీత దర్శకుడు ఖుద్దూస్‌ మాట్లాడుతూ..’ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నిర్మాతకి నా ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నాకు మంచి బ్రేక్‌ వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు.

నిఖిత, సంజన, చిన్నా, ఉత్తేజ్‌, విజయ్‌సాయి, రక్ష, అల్లరి సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఖుద్దూస్‌ ఎస్‌.ఎ., కెమెరా: సాబూ జేమ్స్‌, ఎడిటర్‌: నాగిరెడ్డి, ప్రొడ్యూసర్‌: ఎ.కె. శ్రీకాంత్‌ అంగళ్ళ, కథ-దర్శకత్వం: శివగంగరాజు వుడిమూడి.