గణేశ్‌ నిమజ్జనం.. ట్రాఫిక్‌ ఆంక్షలు

ganesh
- Advertisement -

గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇవాళ ఉదయం నుండి శనివారం ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌పై సమాచారానికి ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రకటిస్తున్నారు. సందర్శకుల వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.

ఈ మార్గాల్లో శోభాయాత్ర ఊరేగింపు కేశవగిరి నుంచి ప్రారంభమవుతుంది. చాంద్రాయణగుట్ట-ఎడమ మలుపు-మహబూబ్‌నగర్‌ ఎక్స్‌ రోడ్-ఫలక్‌నుమా ఆర్‌వోబీ-అలియాబాద్-నాగుల్చింత-చార్మినార్-మదీనా-అఫ్జల్‌గంజ్-ఎస్‌ఏ బజార్-ఎంజే మార్కెట్-అబిడ్స్-బర్కర్‌షీర్-అబిడ్స్-ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్ (నెక్లెస్ రోడ్) వైపు.

సికింద్రాబాద్ ప్రాంతం నుంచి.. ఆర్పీ రోడ్-ఎంజి రోడ్-కర్బలా మైదాన్-కవాడిగూడ-ముషీరాబాద్ ఎక్స్ రోడ్-ఆర్టీసీ ఎక్స్ రోడ్-నారాయణగూడ ఎక్స్ రోడ్-హిమాయత్‌నగర్ ‘వై’ జంక్షన్ మీదుగా వెళ్లి లిబర్టీ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. చిల్కలగూడ ఎక్స్ రోడ్స్ నుంచి వచ్చే విగ్రహాలు ముషీరాబాద్‌లో చేరుతాయి. గాంధీ హాస్పిటల్ మీదుగా ‘X’ రోడ్లు.

ఈస్ట్‌జోన్ నుంచి.. ఉప్పల్-రామంతపూర్-6 నంబర్ జంక్షన్ అంబర్‌పేట్-శివం రోడ్-ఓయూ వద్ద ఎన్‌సీసీ-దుర్గాబాయిదేశ్‌ముఖ్ హాస్పిటల్-హిందీ మహావిద్యాలయ ఎక్స్ రోడ్స్-ఫీవర్ హాస్పిటల్-బర్కత్‌పురా ఎక్స్ రోడ్స్-నారాయణగూడఎక్స్ రోడ్స్ నుంచి వెళ్లి ఆర్టీసీ ఎక్స్‌ రోడ్స్ నుంచి వచ్చే ఊరేగింపులో కలుస్తుంది. అలాగే దిల్ సుఖ్‌నగర్ నుంచి విగ్రహాలు ఐఎస్‌ సదన్-సైదాబాద్-చంచల్ గూడాత్ నల్లగొండ ఎక్స్‌ రోడ్‌ నుంచి వచ్చే ఊరేగింపులో చేరాయి. కొన్ని పెద్ద విగ్రహాలు మూసారాంబాగ్ మీదుగా అంబర్ పేట్ వైపు వెళ్తాయి. తార్నాక వైపు నుంచి వచ్చే విగ్రహాలు ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ రోడ్డు, అడిక్‌మెట్ మీదుగా విద్యానగర్ మీదుగా ఫీవర్ హాస్పిటల్ వద్ద ఊరేగింపుగా చేరాయి.

టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం వైపు నుంచి ఊరేగింపులు మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్-నిరంకారి భవన్-సైఫాబాద్ పాత పోలీస్‌స్టేషన్‌-ఇక్బాల్మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు వెళ్తాయి. ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌నగర్‌-అమీర్‌పేట-పంజాగుట్ట-ఖైరతాబాద్‌ మీదుగా మెహదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారిభవన్‌లో చేరి ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటాయి.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్ వైపు నుండి వచ్చే విగ్రహాలు-సీతారాంబాగ్-బోయిగూడ కమాన్-వోల్గా హోటల్-గోషామహల్ బరాదరి-అలాస్కా మీదుగా ఎమ్‌జె మార్కెట్‌లోని ప్రధాన ఊరేగింపులో చేరి, అబిడ్స్-బషీర్‌బాగ్-లిబర్టీ-అంబేద్కర్ విగ్రహం-ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్ (నెక్లెస్‌ రోడ్) వైపు వెళ్తాయి.

- Advertisement -