ప్రణాళికబద్ద పట్టనీకరణే లక్ష్యం

531
- Advertisement -

అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ర్టాల్లో ఒక్కటైన తెలంగాణ ప్రణాలికబద్దమైన పట్టణీకరణ దిశగా ముందుకు వెళ్లేలా పనిచేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులను మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని CDMA కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూతనంగా టౌన్ ప్లానింగ్ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను మంత్రి అందించారు. మెత్తం 105 మంది కొత్తగా ఉద్యోగాల్లో చేరారు. పట్టణాలు ప్రణాళికబద్దంగా అభివృద్ది జరగడంలో టౌన్ ప్లానింగ్ అదికారులు ప్రధాన పాత్ర వహిస్తారని మంత్రి అన్నారు. లివబుల్ పట్టణాలు, నగరాల లక్ష్యంగా పనిచేయాలని కోరారు. పట్టణీకరణ ద్వారా ఏదురయ్యే సవాళ్లను ఏదుర్కోవడం కోసం ప్రభుత్వం సిద్దంగా ఉందన్ని, పట్టణాల్లోని మౌళిక వసతుల కల్పన ప్రాధాన్యతగా తీసుకుంటున్నామన్నారు. రాబోయే సంవత్సరాల్లో పట్టణాలకు వలస పెరుగుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ముందుకు పొతామన్నారు.

మరోవైపు ప్రభుత్వం వచ్చినాక ఐదేళ్లలో లక్ష ఉద్యోగలిస్తామని నిరుద్యోగులకు ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగాలను భర్తీ చేస్తూ, తమ హమీ నేరవేర్చుతున్నామన్నారు. ఈ దిశగా ఇప్పటికే పలు శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నామని తెలిపారు. ఓక్క రూపాయి లంచం ఇవ్వకుండా పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఏంపికయి వచ్చిన విషయాన్ని గుర్తుంచుకుని, అంతే నిజాయితీతో పనిచేయాలని మంత్రి నూతనంగా ఎన్నికయిన టౌన్ ప్లానింగ్ అధికారులను కోరారు. యువకులుగా ఉన్న కొత్త ఉద్యోగులు హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ చేయాలని సూచించారు. అధునిక సాంకేతిక పరిజ్ఘానాన్ని ఉపయోగించుకోవాలని, డిజిటల్ ప్లాట్ ఫాంలను ఉపయోగించుకుని ప్రజలకు సమాచారం అందేలా చూడాలన్నారు. ప్రజల అవసరాల పట్ల సానూభూతితో వ్యవహరించాలని కోరారు.

గతంలో టౌనిప్లానింగ్ విభాగంపైన వచ్చిన అరోపనలను సిరియస్ గా తీసుకున్నామన్నారు. ఉద్యోగంలో ఉండే ఒత్తిళ్లను ప్రలోభాలను తట్టుకుని నిబద్దతతో ముందుకు సాగాలని కోరారు. నూతనంగా తెలంగాణలో రెండు టెంపుల్ సిటీల నిర్మానానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మంత్రి వివరించారు. వేములవాడ, యాదాద్రి పట్టణాల మాస్టర్ ప్లాన్లను టౌన్ ప్లానింగ్ విభాగమే సొంతంగా చేస్తున్నదన్నారు. అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ది జరిగేలా చూడాలన్నారు. త్వరలోనే రాష్ర్టంలోని అందరు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడియంఏ దానకిశోర్, డిటిసిపి అధికారులు పాల్గోన్నారు.

- Advertisement -