గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్

51
gic

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా తన పుట్టినరోజు పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం వద్ద మొక్కలు నాటారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారం స్పూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో బాగస్వామ్యం చేసిన ఎంపీ సంతోష్ కుమార్ కి సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం ప్రారంభించాలన్న,పుట్టినరోజు,పెళ్లి రోజు ఇతర శుభకార్యాలకు గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటడం సంప్రదాయంగా మారిందని హరిత హారం,గ్రీన్ ఇండియ చాలెంజ్ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో అటవీ శాతం పెరిగిందని అన్నారు.గ్రినరీ పెంచడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుందని దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలి అని సతీష్ రెడ్డి తెలిపారు.