ఇవాళ ఏపీ సీఎం జగన్తో భేటీ కానున్నారు టాలీవుడ్ పెద్దలు. తెలంగాణలో సినిమా షూటింగ్లకు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో ఏపీలో కూడా షూటింగ్కు అనుమతివ్వాలని జగన్ను కోరనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున,తమ్మారెడ్డి భరద్వాజ,రాజమౌళి,త్రివిక్రమ్,కొరటాల శివ,సి కళ్యాణ్,దిల్ రాజుతో మరికొంతమంది సీఎం జగన్ను కలవనున్నట్లు సమాచారం. మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పడుతున్న ఇబ్బందులు, షూటింగులకు అనుమతులు తదితర విషయాలపై చర్చించే అవకాశం ఉంది.
దాదాపుగా రెండు నెలలకు పైగా షూటింగ్ లేక సినిమాలు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో షూటింగ్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో పలు స్టూడియోల నిర్మాణం జరగగా పెద్ద ఎత్తున ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వ సహకారం అందించాల్సిందిగా కోరనున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.