ప్రముఖ హీరో వడ్డే నవీన్ కుమారుడు వడ్డే జిష్ణు పంచకట్టు వేడుక ఇటీవల హైదరాబాద్ మాదాపూర్ లోని ఆవాస హోటల్ లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరంజీవి జిష్ణుకు శుభాశీస్సులు అందజేశారు.
మెగాస్టార్ చిరంజీవి, శ్రీమతి సురేఖా చిరంజీవి, కళాబంధు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి, ప్రముఖ నిర్మాత , నటులు మురళీమోహన్, సునీల్, వేణు, హీరో శ్రీకాంత్ ఆయన సతీమణి ఊహ, నగరి ఎమ్మెల్యే ప్రముఖ నటీమణి రోజా, శివాజీ రాజా, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, రాశి, హేమ, బిగ్ బాస్ విన్నర్ శివ బాలాజీ ఆయన సతీమణి మధులత తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ మాధవి పిక్చర్స్ అధినేతలైన వడ్డే సోదరులు కీర్తిశేషులు వడ్డే శోభనాద్రి, వడ్డే రమేష్ ల దివ్యాశీస్సులతో జరిగిన ఈ కార్యక్రమానికి వడ్డే సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.