తెలంగాణ…ఆవిర్బావం ప్రత్యేకం

302
ts
- Advertisement -

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు ఇది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వాన జరిగిన ఉద్యమానికి ఫలితం అందిన రోజు. జూన్ 2 తెలంగాణ ప్రజలు మర్చిపోలేని రోజు. దశాబ్దాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ భారతదేశ చరిత్రలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.

దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్.

జూన్‌ 2వ తేదీ అంటే ఎన్నో ఉద్వేగ క్షణాలను గుర్తు చేస్తుంది. కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు.. నేడు మన తెలంగాణ దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే. స్వరాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగఫలం,సీఎం కేసీఆర్‌ నిరాహార దీక్ష ఘట్టం ఆ దృశ్యాలు కండ్ల ముందు కదలాడుతూనే ఉంటాయి.

జయశంకర్‌ సారు కాలుకు బలపం కట్టుకుని ఊరురూ తిరుగుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని సజీవంగా ఉంచితే 2001 ఏప్రిల్‌ 21వ తేదీన కేసీఆర్‌ తన డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ ఏప్రిల్‌ 27వ తేదీన టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు.

తెలంగాణ ఉద్యమ ప్రస్ధానంలో కీలక అంశాలు..

2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు
2004 జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన
2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహారదీక్ష
2009 డిసెంబర్ 7న సీఎం రోశయ్య అఖిలపక్ష సమావేశం
2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన
2009 డిసెంబర్ 23న చిదంబరం రెండో ప్రకటన
2010 డిసెంబర్ 10న శ్రీకష్ణ కమిటీ ఏర్పాటు
2012 డిసెంబర్ 28న కేంద్ర స్థాయిలో రెండో సారి ఆల్‌పార్టీ మీటింగ్, తెలంగాణకు అన్ని పార్టీల మద్దతు
2013 జూలై 30న తెలంగాణకు సీడబ్ల్యూసీ గ్నీన్ సిగ్నల్
2013 డిసెంబర్ 16న టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
2014 ఫిబ్రవరి 7న టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
2014 ఫిబ్రవరి 17న పార్లమెంటులో టీ బిల్లు ప్రవేశం
2014 ఫిబ్రవరి 18న టీ బిల్లుపై చర్చ , లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం.
ఫిబ్రవరి 20, 2014: రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ఆమోదం.
మార్చ్‌ 1వ తేదీ, 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్‌ ముఖర్జీ ఆమోదం
మార్చ్‌ 4వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర( గెజిట్‌)లో ప్రచురణ
జూన్‌ 2వ తేదీ 2014: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం

- Advertisement -