స్వచ్చ సర్వేక్షన్‌: ఆ రికార్డును బ్రేక్‌ చేసిన జీహెచ్‌ఎంసీ..

168
- Advertisement -

జీహెచ్‌ఎంసీ మరోసారి రికార్డు నమోదైంది. 15 వేల మందితో స్వచ్చ సర్వేక్షన్‌ కార్యక్రమం చేపట్టి, గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ సృష్టించిన రికార్డును బ్రేక్‌చేసింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది మే నెలలో 5,058 మంది విద్యార్థులతో రోడ్లను రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడా రికార్డుడు జీహెచ్‌ఎంసీ అధిగమించింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర‍్యంలో నేడు బాగ్‌ లింగంపల్లిలో 15 వేల మందితో రోడ్లను ఊడ్చి, స్వచ్ఛతకై పది సూత్రాల ప్రతిజ్ఞ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. వివిధ కళాశాలల నుంచి వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. జీహెచ్‌ఎంసీ కార్మికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

  Swachh Survekshan 2018 in Hyderabad

కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ… మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. స్వచ్చ సర్వేక్షన్‌ 2017 లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉందన్నారు. స్వచ్చ భారత్ మొదలు కాకముందే తెలంగాణ సీఎం నగరాన్ని నాలుగు వందల యూనిట్లుగా చేసి స్వచ్చ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు.

తడి, పొడి చెత్తను వేరుచేయడం కోసం 45 లక్షల చెత్త బుట్టలు పంపిణీ చేసామన్నారు. నగరం బాగుంటనే మనమంతా బాగుంటమన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏది సాద్యం కాదని.. స్వచ్చ సర్వేక్షణలో అందరు పాల్గొని నగరాన్ని అగ్రస్థానంలో ఉంచాలని కేటీఆర్‌ కోరారు.

- Advertisement -