- Advertisement -
అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరి నుండి ప్రతీ రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక న్యూస్‌ని సమంత పోస్టు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతూతో విడిపోయిన దగ్గరి నుండి సామ్ తన ఇన్‌ష్టాగ్రామ్ ఖాతా నుండి చైతన్యతో కలిసి ఉన్న దాదాపు 80 చిత్రాలను తొలగించినట్లు తెలుస్తోంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ – పెట్ డాగ్స్ తో ఉన్న ఫొటోలను కాకుండా..ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే మెల్లగా తొలగిస్తోంది.
ఫొటోలు మొత్తం డిలీట్ చేశాక నాగచైతన్య ను సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తుందేమో చూడాలి. సమంత-నాగ చైతన్య వివాహ బంధానికి అక్టోబర్ 2న తెరపడిన విషయం తెలిసిందే. సమంత తన ఆ జ్ఞాపకాలను శాశ్వతంగా చెరిపివేసి తీర్థయాత్రలకు వెళుతుండగా,చైతూ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
- Advertisement -