కింగ్‌ బర్త్‌డే కానుకగా…. ‘రాజుగారి గది 2’

250
Raju Gari Gadhi 2 for Nag Birthday
- Advertisement -

చిన్న చిత్రంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న చిత్రం రాజు గారి గది. ఈ సినిమాకి సీక్వెల్ గా రూపొందుతున్న చిత్రమే “రాజు గారి గది 2”. కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సమంత, సీరత్ కపూర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Raju Gari Gadhi 2 for Nag Birthday
ప్రస్తుతం ఈ సినిమా, షూటింగ్ పరంగా చివరిదశకి చేరుకుంది. ఆగస్టు చివరివారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు కావడంతో, ఆ రోజున ఈ సినిమాను విడుదల చేస్తే బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినట్టుగా అవుతుందని వాళ్లు భావిస్తున్నారట. ఆ దిశగా పనుల వేగాన్ని పెంచినట్టుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో నాగ్ ఫస్టు కాపీ చూశాక మార్పులు చేర్పులు చెబుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాకి కూడా జరిగితే మాత్రం, నాగ్ పుట్టిన రోజున ఈ సినిమా థియేటర్స్ కి రావడం సందేహమేనని చెప్పుకుంటున్నారు.

నరేష్, అశ్విన్, వెన్నెల కిషోర్, ప్రవీణ్ లు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్.ఎస్, కళ: ఏ.ఎస్.ప్రకాష్, సినిమాటోగ్రఫీ: దివాకరన్, మాటలు: అబ్బూరి రవి, నిర్మాణం: పివిపి సినిమా-మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్-ఓక్ ఎంటర్ టైన్మెంట్, దర్శకత్వం: ఓంకార్!

- Advertisement -