రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ మేడ్చల్ జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్…ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వ పథకాలు,పించన్ వంటి అంశాలపై చర్చించారు. మేడ్చల్ జిల్లాలోని కండ్లకయలో ద్రువ కాలేజీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి గ్రామంలోని మహిళలతో మాట్లాడారు. వారి యోగ క్షేమాలడిన మంత్రి, ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపైన పలువురితో మాట్లాడారు.
పించన్లు వస్తున్నాయని, గతంలో గంటే బాగా ఉన్నామని మంత్రికి కండ్లకోయ గ్రామానికి చెందిన డప్పు పొచమ్మ తెలిపింది. తమ కుటుంబానికి డబుల్ టెడ్ రూం ఇల్లు కావాలని కోరింది. దీంతో నగరంలో లక్ష ఇళ్లు కడుతున్నామని మంత్రి తెలిపారు. అయితే మీరు ఉన్న చోటనే కట్టించేందుకు సిద్దంగా ఉన్నామని, లేకుంటే ఖాలీ జాగ ఉన్న చోట కట్టేందుకు సైతం ప్రభుత్వం తయారుగా ఉందని తెలిపారు. ఇందుకోసం మీరంతా కలిసి ఒక్క నిర్ణయం తీసుకోవాలని బస్తే మహిళలకు తెలిపారు. ఈ విషయంలో మీకు స్థానిక కార్పోరేటర్, అధికారులు సహకారం అందిస్తారని హమీ ఇచ్చారు.
కార్పోరేటర్లు సరిగ్గా పనిచేస్తున్నారా అందుబాటులో ఉంటున్నారా అని అడిగారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన నోట్ల రద్దుపైన మహిళ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త నోట్లకు ఇబ్బందులవుతున్నాయా అని అడిగారు. పించన్లు పొందే వృద్దుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.