నర్సింహులుది రాజకీయ ప్రేరేపిత హత్యే: హరీశ్ రావు

259
harishrao
- Advertisement -

వర్గల్ మండలం వేలూర గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింహులు మృతి దురదృష్టకరమన్నారు మంత్రి హరీశ్‌ రావు. ఇది ముమ్మాటికి విపక్షాల రాజకీయ ప్రేరేపిత హత్యేనని మండిపడ్డారు.

గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్‌…ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. మృతుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని…స్వలాభం కోసం అమాయకులను బలిచేయవద్దన్నారు.

మృతుడి కుటుంబానికి ఎక్స్రే గ్రేషియాతో పాటు ఎకరం భూమి, తక్షణ సహాయంగా రూ.2 లక్షలు అందజేస్తున్నామని చెప్పారు. మృతుడి కుమార్తెను ప్రభుత్వ ఖర్చులతో చదివిస్తామని…రైతు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపిస్తాం అన్నారు. మృతుడి భూమిని కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే సబ్ స్టేషన్ కోసం స్వాధీనం చేసుకున్నారని ..నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని హరీశ్ పేర్కొన్నారు.

- Advertisement -