బీఆర్ఎస్ పాలనలో పల్లెసీమ..ప్రగతి సీమగా!

14
- Advertisement -

పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న… మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణంపోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది అన్నారు.

సమైక్యపాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం. అనితరసాధ్యం అన్నారు. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాల హరివిల్లైంది. కేసీఆర్ గారి సంకల్పంతో ప్రతి పల్లెసీమ ప్రగతిసీమగా మారింది అని.. ప్రతి పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేని పరిస్థితి. కూలిపోయే స్థితి ఉన్న ఖాళీ ఇండ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురికికాలువల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం చూపించామన్నారు.

కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతలేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామస్వరాజ్యంలో ఓ స్వర్ణయుగం అని.. పచ్చదనానికి కొదవలేకుండా, నిధులకు కొరతలేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ విజన్ అన్నారు.
దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయం అన్నారు.

Also Read:ఆపరేషన్ కగార్..మావోలకు దడ!

నాడు పదేళ్లపాటు మురిసిన పల్లె, కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగా గాడితప్పింది…ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లెప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు అన్నారు.

- Advertisement -