సాయిధరమ్ ‘జవాన్’ ట్రైలర్‌..

180
Jawaan Movie Theatrical Trailer
- Advertisement -

సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘జవాన్’. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి బీవీఎస్‌ రవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో విడుదలైన జవాన్‌ ప్రీలుక్ పోస్ట‌ర్, టైటిల్‌,ఫస్ట్‌ లుక్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న రాగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ గురువారం విడుదలైంది.

సినిమా మొత్తం ఆక్టోపస్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ని జవాన్‌గా ధరమ్‌తేజ్‌ ఎలా కాపాడతాడు అన్న నేపథ్యంలో ఉంటుంది. ఇందులో తమిళ నటుడు, నటి స్నేహ భర్త ప్రసన్న ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. పోరాట సన్నివేశాల్లో ‘యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా, వెనకోడు ఆగిపోయాడా, ముందోడు కూలిపోయాడా కాదురా.. యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం’ అని ధరమ్‌ చెప్తున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.ఈ చిత్రనికి ఎస్‌.ఎస్‌ తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్‌ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -